NTV Telugu Site icon

Cisco: టెక్కీలకు షాక్.. ఉద్యోగుల తొలగింపు ప్రారంభించిన సిస్కో..

Cisco

Cisco

Cisco Joins Global Wave Of Tech Lay-Offs, Will Cut 4,000 Jobs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్భనం, ఆదాయం తగ్గిపోవడవంతో టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో టెక్ దిగ్గజ సంస్థ చేరింది. సిస్కో గత నెలలో 4000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని అంచనాలు చెబుతున్నాయి. తాజాగా సిస్కో కంపెనీ తన ఉద్యోగులకు తొలగింపు విషయాన్ని తెలిపింది. సిస్కో తన వర్క్ ఫోర్స్ లో 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది.

Read Also: Cervical Cancer Vaccine: గుడ్ న్యూస్.. 4 నెలల్లో అందుబాటులోకి గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్

ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల టెక్ రంగం కుదేలు అవుతోంది. ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్, లెనోవో, సేల్స్ ఫోర్స్, అడోబ్, గూగుల్ వంటి సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే ట్విట్టర్ తన కంపెనీలో 50 శాతం అంటే దాదాపుగా 3800 మందిని, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా 13 శాతం అంటే 13,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక గూగుల్ 10,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. అమెజాన్ ఏకంగా 20 వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది.

బ్రిటన్, అమెరికా ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. అమెరికా ఆర్థికవేత్తల ప్రకారం వచ్చే 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది. అయితే ఆర్థిక మాంద్యం పరిస్థితి ముందుగా టెక్ సంస్థలపై పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీని ప్రభావం ఇండియా ఐటీ ఇండస్ట్రీపై కూడా పడబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దేశీయ టెక్ దిగ్గజ కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నాయి. దీంతో రానున్న కాలంలో ఇండియన్ ఐటీ పరిశ్రమ కుదేలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.