Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Chinas Most Advanced Stealth Fighters Deployed 150 Km From Sikkim

China: సిక్కింకి 150 కి.మీ దూరంలో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించిన చైనా..

Published Date :May 30, 2024 , 5:38 pm
By Venu Goapl Reddy
China: సిక్కింకి 150 కి.మీ దూరంలో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించిన చైనా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

China: జిత్తులమారి డ్రాగన్ కంట్రీ చైనా భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భారత సరిహద్దులను అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే, ప్రస్తుతం భారత్ కూడా తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. ఇదిలా ఉంటే, సిక్కిం నుంచి కేవలం 150 కి.మీ దూరంలో చైనా తన అత్యాధునిక J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లలను మోహరించినట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. టికెట్‌లోని రెండో అతిపెద్ద పట్టణమైన షిగాట్సేలోని ఎయిర్‌పోర్టులో ఆరు J-20 ఫైటర్ జెట్లను మోహరించింది.

షిగాట్సే ఎయిర్‌పోర్టు మిలిటరీ, సివిలియన్ రెండు విధాలుగా పనిచేసేలా నిర్మించారు. ఈ విమానాశ్రయం 12,408 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విమానాశ్రయాల్లో ఒకటి. ఈ ఫైటర్ జెట్లతో పాటు J-500 ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా చిత్రాల్లో కనిపించింది. అయితే, భారత వైమానికదళం ఇప్పుడే దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

J-20 స్టీల్త్ ఫైటర్ ఇప్పటి వరకు చైనా యొక్క అత్యంత అధునాతనమైన ఆపరేషనల్ ఫైటర్ జెట్. ఈ విమానాలు ప్రధానంగా చైనాలోని తూర్పు ప్రావిన్సులో ఉన్నాయని సమాచారం. అయితే, అందుకు భిన్నంగా వీటిని భారత సరిహద్దుల వద్ద మోహరించారని ప్రముఖ జియో‌స్పేషియల్ విశ్లేషకుడు సిమ్ టాక్ తెలిపారు. భారత్ ప్రస్తుతం 36 ఫ్రెంచ్- నిర్మిత రాఫెల్ యుద్ధవిమానాలతో J-20ని ఎదుర్కొంటుంది. వీటిలో 8 ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) తో అధునాతన వైమానిక పోరాట వ్యాయామాల కోసం అలాస్కాకు వెళ్లాయి.

China

Read Also: Southwest Monsoon: చాలా అరుదు.. కేరళ, ఈశాన్య ప్రాంతాలకు ఒకేసారి రుతుపవనాల రాక..

చైనా షిగాట్సే ఎయిర్ పోర్టు పశ్చిమ బెంగాల్‌లోని హసియార ఎయిర్ బేస్ నుంచి 290 కి.మీ కన్నా ఎక్కువ దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారత్ 16 రాఫెల్స్‌‌తో కూడిన రెండు స్వ్కాడ్రన్లను మోహరించి ఉంచింది. టిబెట్‌లో చైనా J-20 మోహరించడం ఇదే మొదటిసారి కాదు. 2020 మరియు 2023 మధ్య చైనాలోని హోటాన్ ప్రిఫెక్చర్‌లోని జిన్‌జియాంగ్‌లో జెట్‌లు గమనించబడ్డాయి.చెంగ్డు J-20, మైటీ డ్రాగన్ అని కూడా పిలుస్తారు, ఇది 2017లో సర్వీస్‌లోకి వచ్చింది. ఇది ట్విన్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్. అయితే, చైనా ఇప్పటికే 250 వరకు J-20 జెట్లను మోహరించి ఉంచవచ్చని, వీటిని ఉపగ్రహ చిత్రాలు గుర్తించకుండా ఉండొచ్చని భావిస్తున్నారు.

స్టెల్త్ ఫైటర్ జెట్లను కార్యాచరణ కోసం రంగంలోకి దింపిన మూడో దేశంగా చైనా ఉంది. దీని ప్రధాన ప్రాముఖ్యత ‘‘ఎయిన్ సుపీరియారిటీ’’. ఇది చైనా అత్యంత అధునాతన ఎయిర్-టూ-ఎయిర్ క్షిపణుల్ని కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం PL-15 దీర్ఘ-శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి కూడా ఉంది, వీటికి 300 కి.మీ పరిధిలోని వైమానిక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నమ్ముతారు. గత ఐదేళ్లుగా భారత సరిహద్దు వెంబడి చైనా తన వాయుశక్తిని పెంచుతోంది. భారత్ కూడా సరిహద్దుల్లో సైనిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • india
  • Indo China Border
  • J-20 stealth fighter
  • LAC

తాజావార్తలు

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

  • Monalisa: ‘‘ మోనాలిసా పారిపోయింది’’.. భర్త ఫర్మాన్ సంచలన వీడియో..

  • Nimmala Ramanaidu : జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదం

  • US Iran Conflict: ఇస్లామాబాద్ చర్చలు అట్టర్ ఫ్లాప్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదరని డీల్! ఇక బాంబుల మోత తప్పదా?

  • KTR : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై స్పష్టతనిచ్చిన కేటీఆర్

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions