NTV Telugu Site icon

China: చైనాలో ఏం జరుగుతోంది..? రక్షణ, విదేశాంగ మంత్రుల తొలగింపు..

డ్ుయల

డ్ుయల

China: చైనాలో వరసగా పలువురు మంత్రులు పదవులను కోల్పోవడమో, లేకపోతే కనిపించకపోవడమో జరుగుతోంది. తాజాగా చైనా రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి తమ పదవులను కోల్పోయారు. రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన లీ షాంగ్‌ఫూ దేశం తరుపున అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. తాజాగా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రభుత్వం లీ షాంగ్‌ఫుని తొలగించినట్లు అక్కడి మీడియా మంగళవారం తెలిపింది. కేవలం ఏడు నెలల్లోనే ఆయన తన పదవిని కోల్పోయాడు. స్టేట్ కౌన్సిలర్ టైటిల్, ప్రభుత్వం అత్యున్నత జాతీయ రక్షణ సంస్థలో సభ్యత్వం నుంచి తొలగించబడ్డాడు.

Read Also: Cable Bridge: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతగా లేదు.. అందుకే ఇలా అయింది..!

ఇతన్నే కాకుండా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ ను కూడా పదవి నుంచి తొలగించి ప్రపంచాన్ని ఆశ్యర్యపరిచారు. అతని స్టేట్ కౌన్సిలర్ హోదాను కూడా తొలగించారు. అవినీతి, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వారిపై విచారణ జరుపుతున్నామని, లీ, క్విన్‌లు తమ రాష్ట్ర బిరుదులను తొలగించారని ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ ఫర్ చైనా అనాలిసిస్‌లో చైనీస్ రాజకీయాల
నిపుణుడు నీల్ థామస్ అన్నారు.

మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా జిన్ పింగ్ ఎదిగాడు. అయితే జిన్ పింగ్ అధికారానికి ఎలాంటి ముప్పు ఉన్న సూచనలు లేనప్పటికీ, ఇలా కీలక స్థానాల్లో ఉన్న మంత్రుల్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక మందగమాన్ని ఎదుర్కొంటోంది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో అమెరికా-చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఈ తొలగింపులు చోటు చేసుకున్నాయి.