Site icon NTV Telugu

China: టీఆర్‌ఎఫ్‌ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై చైనా సంచలన ప్రకటన

China

China

పహల్గామ్‌లో మారణహోమానికి తెగబడిన ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ను అగ్ర రాజ్యం అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తయిబాకు ముసుగు సంస్థగా టీఆర్‌ఎఫ్‌ పని చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది.

ఇది కూడా చదవండి: Pakistan: భారత విమానాలకు గగనతల నిషేధం పొడిగింపు.. ఎప్పటివరకంటే..!

తాజాగా చైనా కూడా అమెరికా నిర్ణయానికి మద్దతు పలికింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. ఇక పహల్గామ్ ఉగ్ర దాడిని చైనా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని అన్ని దేశాలను కోరుతున్నట్లు తెలిపింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని సంయుక్తంగా కాపాడుకోవాలని పొరుగు దేశాలను చైనా కోరుతుందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Sreeleela : బాలీవుడ్‌లో మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..

ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలీకృతం అయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు చైనా సంఘీభావం తెలిపినట్లు కనిపిస్తోంది.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పాకిస్థాన్‌పై భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అలాగే పాకిస్థాన్ స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మొత్తానికి ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ప్రస్తుతం రెండు దేశాల ప్రశాంత వాతావరణం నెలకొంది.

Exit mobile version