పహల్గామ్‌లో మారణహోమానికి తెగబడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ను అగ్ర రాజ్యం అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తయిబాకు ముసుగు సంస్థగా టీఆర్‌ఎఫ్ పని చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు.