Site icon NTV Telugu

China-Iran: యుద్ధంలోకి చైనా! ఇరాన్‌కు డ్రాగన్ మద్దతు

China

China

మధ్యప్రాచ్యం యుద్ధంలో కీలక మలుపు తిరగబోతున్నట్లుగా కనిపిస్తోంది. డ్రాగన్ దేశం చైనా కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. తాజాగా ఇరాన్‌కు మద్దతుగా గళం విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ప్రకటించింది. తక్షణమే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని డ్రాగన్ దేశం సూచించింది.

ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు హతమయ్యారు. అప్పటి నుంచి ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం పరస్పర దాడులతో చెలరేగిపోతున్నాయి.

అయితే తొలుత ఖమేనీ హత్యను చైనా ఖండించి ఊరుకుంది. తాజాగా ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామంటూ ముందుకొచ్చింది. దీంతో చైనా కూడా ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి దిగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా ఉద్రిక్తతతో అట్టుడికిపోతుంది. ఇక చైనా కూడా రంగంలోకి దిగితే పరిస్థితులు మరింత దిగజారిపోతాయని భయాందోళనలు నెలకొంటున్నాయి.

Exit mobile version