Site icon NTV Telugu

చైనా కొత్త డిమాండ్ః వూహాన్ ల్యాబ్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి…

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ఏ విధంగా అత‌లాకుత‌లం చేసిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా కోట్లాదిమంది జీవ‌నం అస్త‌వ్య‌స్తం అయింది.  ల‌క్ష‌లాదిమంది మృతి చెందారు. ఈ మ‌హ‌మ్మారికి ప్ర‌ధాన కార‌ణం ఎవ‌రు అంటే ఠ‌క్కున వ‌చ్చే స‌మాధానం చైనా.  చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి ఈ వైర‌స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు ఇప్ప‌టికే నిపుణులు బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు. అయితే, క‌రోనా వైర‌స్‌ను జీనోమ్ చేసిన, మ‌హ‌మ్మారిపై విసృత ప‌రిశోధ‌న‌లు చేసినందుకు వూహాన్‌లోని వైరాల‌జీ ల్యాబ్ కు మెడిసిన్ రంగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాల‌ని చైనా డిమాండ్ చేస్తున్న‌ది.  

Read: “రాధే శ్యామ్” షూటింగ్ రీస్టార్ట్

తాము ఈ వైర‌స్ గురించి ప‌రిశోధ‌న‌లు చేసి జీనోమ్‌ను సీక్వెన్స్ చేసి ఉండ‌కుంటే ఇంకా ప్ర‌పంచం ఇబ్బందులు ప‌డేద‌ని చెప్పుకొచ్చింది.  వూహాన్ ల్యాబ్‌కు నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాల‌నే వాద‌న హాస్యాస్ప‌దంగా ఉంద‌ని చైనా వైరాల‌జీ శాస్త్ర‌వేత్త డా. లీ మెంగ్ యాంగ్ పేర్కొన్నారు.  వూహాన్ ల్యాబ్ నుంచి వైర‌స్ లీక్ అయింద‌ని చెప్పిన వారిలో ఈయ‌న కూడా ఒక‌రు.  ఇక చైనా డిమాండ్‌పై సోష‌ల్ మీడియాలో అనేక కామెంట్లు వ‌స్తున్నాయి.  ప్ర‌పంచాన్ని, ప్ర‌జ‌ల జీవితాల‌ను నాశ‌నం చేయ‌డానికి వూహాన్ ల్యాబ్ ఎంత‌గానో కృషిచేసింద‌ని, ప్ర‌జ‌ల జీవితాల‌ను నాశ‌నం చేసినందుకు వూహాన్ ల్యాబ్‌కు త‌ప్ప‌కుండా నోబెల్ ఇవ్వాల‌ని, అలానే, ప్రపంచంలో మార‌ణ‌కాండ సృష్టిస్తున్న ఐసిస్‌కు కూడా శాంతి బ‌హుమ‌తి ఇవ్వాల‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.  

Exit mobile version