“రాధే శ్యామ్” షూటింగ్ రీస్టార్ట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ చివరి షెడ్యూల్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్యాచ్ వర్క్ లో భాగంగా మేకర్స్ కొన్ని టాకీ సన్నివేశాలను 4 రోజులు చేయనున్నారు, ఆపై ప్రభాస్, పూజలపై లవ్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు మేకర్స్.

Read Also : ప్రకాష్ రాజ్ ఇలాంటి వారు అనుకోలేదు… ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్

ఈ చిత్రం హిందీ, తెలుగు వెర్షన్లకు రెండు వేర్వేరు సౌండ్‌ట్రాక్ లు ఉన్నాయి. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్‌లో పాటలు కంపోజ్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి కాపీ సిద్ధమైన తర్వాత నాన్‌స్టాప్ ప్రమోషన్లు ప్రారంభమవుతాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. గతంలో ఈ చిత్రాన్ని జూలై 30న ప్రేక్షకులం ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది.

Related Articles

Latest Articles

-Advertisement-