China: అత్యంత శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించిన చైనా.. ఎవరికి వార్నింగ్!
- అత్యంత శక్తివంతమైన అణు క్షిపణుల ప్రదర్శన
- జపాన్‌పై వేసిన అణు బాంబుల కంటే 200 రెట్లు శక్తివంతమైనవి ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా బుధవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. బీజింగ్ వేదికగా అత్యంత పవర్‌ఫుల్ క్షిపణులను ప్రదర్శించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించిన గుర్తుగా 80వ వార్షికోత్సవాన్ని చైనా నిర్వహించింది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. పెద్ద ఎత్తున ఆయుధాల ప్రదర్శన జరిగినప్పుడు నేతలంతా ఆద్యంత ఆసక్తిగా వీక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ఇది కూడా చదవండి: Delhi: పాక్, ఆప్ఘనిస్థాన్ మైనార్టీలకు గుడ్‌న్యూస్.. పాస్‌పోర్టుపై కేంద్రం కీలక ప్రకటన
Also Read
అయితే జపాన్‌పై గతంలో వేసిన అణు బాంబుల కంటే 200 రెట్లు శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. DF-5C వంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు చూపించింది. హైపర్సోనిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు, నీటి అడుగున వెళ్లే డ్రోన్లు అబ్బురపరిచాయి. పుతిన్-జిన్‌పింగ్-కిమ్ ముగ్గురూ పక్కపక్కనే నిలబడి వీక్షించారు. ఈ ప్రదర్శనతో చైనాను ఆపలేమంటూ నేతలు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాజా అణు క్షిపణులే 20,000 కి.మీ లక్ష్యాలను కూడా ఛేదించగలవని ఒక సైనిక నిపుణుడు పేర్కొన్నట్లు చైనీస్ దినపత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Indrani Mukerjea: షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు.. ఇంద్రాణి కుమార్తె ఏం వాంగ్మూలం ఇచ్చిందంటే..!
ఇదిలా ఉంటే పుతిన్, జిన్‌పింగ్, కిమ్.. అమెరికాపై కుట్ర పన్నుతున్నారంటూ ట్రంప్ ఆరోపించారు. చైనా సైనిక కవాతు సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా పక్షాన అమెరికా సైనికులు కూడా రక్తాన్ని చిందించారని.. ఈ సందర్భగా చైనా అధ్యక్షుడు గుర్తు చేసుకోవాలని ట్రంప్ హితవు పలికారు.
తాజావార్తలు
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!