Employee Salary: జీతం 50 వేలు.. వచ్చింది కోటిన్నర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదృష్టం తలుపు తట్టినప్పుడే సద్వినియోగపరచుకోవాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా.. ఆ అదృష్టం చేజారిపోతుంది. ఈ సూత్రాన్ని ఒక ఉద్యోగి బాగా నెమరవేసుకున్నట్టు ఉన్నాడు. అందుకే, తనకు అదృష్ట దేవత తలుపుతట్టగానే తెలివి ప్రదర్శించాడు. దర్జాగా కోటిన్నరతో పరారయ్యాడు. ఒక కంపెనీలో జరిగిన ఓ తప్పు, అతనికి వరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలో కన్సార్సియో ఇండస్ట్రియల్ డే అలిమెంటోస్ అనే ప్రముఖ మైనింగ్ సంస్థ ఉంది. ఇందులో వేలాది మంది కార్మికులు, వందలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఇటీవల వేతనాల చెల్లింపు సమయం వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఉద్యోగికి 500,000 పేసోలు (రూ.50 వేలు) జీతం కింద చెల్లించాల్సి ఉంది. కానీ.. అకౌంట్స్ విభాగం చేసిన ఓ తప్పు కారణంగా ఆ ఉద్యోగి ఖాతాలో ఏకంగా 165,398,851 పేసోలు (రూ.1.42 కోట్లు) జీతంగా పడ్డాయి. తనకు రెగ్యులర్‌గా వచ్చే జీతం కంటే ఇది 286 రెట్లు. అంత మొత్తం రావడంతో షాక్‌కి గురైన సదరు ఉద్యోగి.. తనకు ఎక్కువ జీతం పడిన విషయాన్ని అకౌంట్స్ విభాగానికి చెప్పాడు. తమ తప్పును గుర్తించిన అకౌంట్స్ విభాగం.. ఆ సొమ్మును తిరిగి తమ ఖాతాకు పంపాలని కోరింది. అయితే.. ఇంతలో ఆ ఉద్యోగి బుద్ధి మారింది. తాను జీవితాంతం కష్టపడినా అంత మొత్తం సంపాదించలేనని అనుకొని, వచ్చిన ఆ డబ్బుతో ఉడాయించాలని నిర్ణయించుకున్నాడు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
తొలుత బ్యాంకుకు వెళ్లి డబ్బు తిరిగి జమ చేస్తానని చెప్పిన ఆ ఉద్యోగి.. ఆ పని చేయకుండా హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అంతే, ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. రెండు రోజులైనా ఆ ఉద్యోగి నుంచి డబ్బులు తిరిగి రాకపోవడంతో అతడ్ని సంప్రదిస్తే.. ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. ఇంటికెళ్తే, అక్కడ కూడా లేడు. అటు, ఆఫీస్‌లో రిజైన్ లెటర్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో.. అతగాడు ఆ సొమ్ము తీసుకొని పరారయ్యాడని సదరు కంపెనీకి అర్థమైంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!