అదృష్టం తలుపు తట్టినప్పుడే సద్వినియోగపరచుకోవాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా.. ఆ అదృష్టం చేజారిపోతుంది. ఈ సూత్రాన్ని ఒక ఉద్యోగి బాగా నెమరవేసుకున్నట్టు ఉన్నాడు. అందుకే, తనకు అదృష్ట దేవత తలుపుతట్టగానే తెలివి ప్రదర్శించాడు. దర్జాగా కోటిన్నరతో పరారయ్యాడు. ఒక కంపెనీలో జరిగిన ఓ తప్పు, అతనికి వరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలో కన్సార్సియో ఇండస్ట్రియల్ డే అలిమెంటోస్ అనే ప్రముఖ మైనింగ్ సంస్థ ఉంది. ఇందులో వేలాది మంది…