Site icon NTV Telugu

Charlie Kirk: చార్లీ కిర్క్‌ను హత్య చేసినవాడు దొరికాడు: డొనాల్డ్ ట్రంప్..

Charlie Kirk

Charlie Kirk

Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు, మేక్ అమెరికా గ్రేట్ అగెన్(MAGA) క్యాంపెన్‌ను నిర్వహించిన రిపబ్లికన్ మద్దతుదారు చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచంలో సంచలనంగా మారింది. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా చార్లీ కిర్క్‌కు పేరుంది. ఊటా యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో, దుండగుడు ఆయన గొంతులో కాల్చి చంపాడు. వెంటనే, కిర్క్ అక్కడిక్కడే మరణించాడు. కాల్చిన వ్యక్తికి సంబంధించిన ఫోటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. నిందితుడు హై పవర్ రైఫిల్ ఉపయోగించినట్లు అధికారులు చెప్పారు.

Read Also: 1973 Plane Hijacking: నేపాల్ ప్రధాని రేసులో సుశీలా కర్కీ.. ఈమె భర్త విమానం హైజాక్‌ చేశాడని తెలుసా..?

ఇదిలా ఉంటే, చార్లీ కిర్క్‌ను కాల్చిచంపిన నిందితుడు కస్టడీలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. నిందితుడికి క్లోజ్‌గా ఉండే వ్యక్తి అతడి ఆచూకీ చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ వార్తా తనకు ఓ మంత్రి ద్వారా వచ్చినట్లు చెప్పారు. నిందితుడిని అధికారికంగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు, ఇతర చట్ట అమలు ఏజెన్సీలు ధ్రువీకరించలేదు. కానీ కొన్ని నివేదికలు మాత్రం అనుమానితుడు పట్టుబడినట్లు చెప్పాయి. హత్య తర్వాత హంతకుడు యూనివర్సిటీ భవనాల పైకప్పు నుంచి పారిపోతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Exit mobile version