NTV Telugu Site icon

Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ రహస్య బంకర్లో భారీగా డబ్బు, వ్యక్తిగత షవర్‌

Sinwar

Sinwar

Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన దాడుల్లో చనిపోయారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్‌ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్‌ ఉన్న ఈ బంకర్‌లో వంట గది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సామాగ్రి, మిలియన్‌ డాలర్ల భారీ నగదుతో పాటు పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్‌ కూడా ఉంది. దీనికి సంబంధించిన ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.

Read Also: Charles III: బ్రిటన్‌ రాజుకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఘోర అవమానం.. నువ్వు మాకు రాజువి కాదంటూ..

ఇక, అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి యహ్యా సిన్వార్ ప్రధాన సూత్రధారి. ఆయన రఫాకు పారిపోయే ముందు ఈ బంకర్‌లోనే కొన్ని రోజుల పాటు గడిపినట్లు సమాచారం. ఇస్మైల్ హనియే హత్య తర్వాత ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్‌ను చంపివేసేందుకు టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే 2024 అక్టోబర్ 16న ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో సిన్వార్‌ మృతి చెందారు. కాగా, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో తల దాచుకున్నట్లు తెలుస్తుంది. మానవతా సహాయం, ఆయుధాలు, మిలియన్ల డాలర్ల నగదుతో పాటు ఐక్యరాజ్యసమితికి చెందిన రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ బ్యాగులు ఆ సొరంగంలో దర్శనమిచ్చాయి.

Read Also: Pinipe Viswarup: మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు అరెస్ట్‌!

అయితే, గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని.. పిరికివాడిలా యహ్యా సిన్వార్ భూగర్భంలో దాక్కున్నారు అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7న దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్‌ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని వెళ్తున్న దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32 వేల అమెరికన్‌ డాలర్ల (సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ని తీసుకువెళ్లడం అందులో కనిపిస్తుంది.

Show comments