NTV Telugu Site icon

Canada: వీడు ‘బాల బాహుబలి’.. 6.8 కిలోల బరువుతో పుట్టాడు..

Canada

Canada

Canada: సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు సగటున 3.5 కిలోలు ఉంటుంది. 2.5 కిలోల నుంచి 4.5 కిలోల బరువును సాధారణంగా పరిగణిస్తారు. ఇది ఆరోగ్యం ఉన్న శిశువు బరువు. కొన్ని సందర్భాల్లో పుట్టిన సమయంలో పిల్లల బరువు దీని కన్నా తక్కువగా లేదా ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రం బాహుబలిగా జన్మిస్తుంటారు. తాజాగా కెనడాలో ఓ పిల్లాడి జననం 2010 నుంచి ఉన్న రికార్డులను తుడిపేసింది.

Read Also: Qatar: ఖతార్‌లో మాజీ నావీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ దాఖలు చేసిన భారత్..

అయితే కెనడాకు చెందిన ఓ జంటకు రికార్డు స్థాయి బరువుతో బాబు జన్మించాడు. ఏకంగా 6.8 కిలోల బరువు ఉండటంతో ఇటు డాక్టర్లు, అటు పేరెంట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2010 నుంచి ఇదే రికార్డ్. అక్టోబర్ 263న ఒంటారియోలోని కేంబ్రిడ్జ్‌లోని కేంబ్రిడ్జ్ మెమోరియల్ హాస్పిటల్‌లో బ్రిట్నీ అనే మహిళలకు ఈ ‘బాల బహుబలి’ జన్మించాడు. బ్రిట్నీ, ఛాన్స్ ఐరెస్‌లకు ఇది ఐదో సంతానం. ఇతనికి సోనీ అనే పేరు పెట్టారు.

ఇంత బరువుతో శిశువు జన్మించడంపై డాక్టర్లు, నర్సులు ఉత్సాహపరిచిన విధానం మనసుకు హత్తుకునేలా ఉందని శిశువు తండ్రి ఛాన్స్ ఐరెస్ ఆనందంతో చెప్పారు. మిలియన్ ఏళ్లలో కూడా 6.8 కిలోల శిశువు జన్మిస్తాడని అనుకోనని చెప్పారు. శిశువు జన్మించిన తర్వాత డాక్టర్లు, నర్సులు ఇతను ఎంత పెద్దవాడు అవుతాడనే దానిపై బెట్ కాస్తున్నారని అతను వెల్లడించారు. శిశువు 55 సెంటీమీటర్ల పొడవు ఉన్నాడని వైద్యులు తెలిపారు.