NTV Telugu Site icon

Canada: యూఎస్ ప్రజలకు సైతం డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బ తప్పదు..

Canada

Canada

Canada: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడాపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రియాక్ట్ అయ్యారు. యూఎస్ టారీఫ్ లు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్‌ పన్నుల దెబ్బ తప్పదంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. అయితే, యూఎస్- కెనడా దేశాల మధ్య దశాబ్దాల కాలంలో ఇదే అతి పెద్ద వాణిజ్య వార్ అని వెల్లడించింది. కాగా, ఏ వాణిజ్యంలోనైనా కఠినమైన రియాక్షన్ తప్పకుండా ఉంటుందన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికలు అమలు చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు కెనడా రెడీగా ఉందని తెలిపారు. ఆ చర్యతో తమ కస్టమర్లు, కెనడా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మెలానీ జోలీ పేర్కొన్నారు.

Read Also: SSIA: సింగపూర్‌ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్‭తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

ఇక, ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వలసలు, డ్రగ్స్‌ అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా చేరాలంటూ జస్టిన్ ట్రూడోకు ట్రంప్ హెచ్చరించాడు. ఇక, అమెరికాకు కాబోయే అధ్యక్షుడు చేసిన హెచ్చరికలు ఎదుర్కొనేందుకు తాము రెడీగా ఉన్నామని కెనడా స్పష్టం చేసింది. మరోవైపు ట్రూడో తాను ప్రధాన మంత్రి పదవితో పాటు లిబరల్‌ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించారు. కాగా, తన వారసుడిని పార్టీ ఎంపిక చేసే వరకు తాత్కాలిక ప్రధానిగా పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు.