Canada New PM: మార్చ్ 9న కెనడాకు కొత్త ప్రధాని
- లక ప్రకటనను విడుదల చేసిన లిబరల్ పార్టీ..
- మార్చ్ 9వ తేదీన కెనడాకు కొత్త ప్రధాని..
- కొత్త నాయకుడు ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada New PM: కెనడాలో కూడా రాజకీయం హీటెక్కింది. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతో పాటు లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కెనడా తదుపరి ప్రధాన మంత్రి ఎవరనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఈక్రమంలోనే లిబరల్ పార్టీ ఓ కీలక ప్రకటనను రిలీజ్ చేసింది. మార్చి 9వ తేదీన తమ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుందని లిబరల్స్ ప్రకటించారు. గురువారం నాడు ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది ఆ పార్టీ.
Read Also: Daaku Maharaaj : నేడు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..?
Also Read
అయితే, కొత్త నేతను పార్టీ ఎన్నుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని అనుకుంటున్నాను అని సోమవారం నాడు మీడియాకు ట్రూడో వెల్లడించారు. కొత్త నేతను ఎన్నుకునే వరకు కెనడా పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ సస్పెన్షన్ మార్చి 24వ తేదీ వరకూ కొనసాగుతుందన్నారు. ఇక, 2015లో ప్రధానిగా అధికారంలోకి వచ్చిన ట్రూడోకు ఇటీవల సొంత పార్టీ ఎంపీల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. కెనడాపై 25 శాతం పన్నూలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చాడు.
Read Also: Anantapur Range DIG: తొక్కిసలాట ఘటనపై ఆధారాలు ఉంటే ఇవ్వండి..
అంతేకాక.. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించలేకపోతే అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలంటూ జస్టిన్ ట్రూడోకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పాడు. దీంతో ట్రూడోపై మరింత ఒత్తిడి పెరగడంతో.. సొంత పార్టీ నేతలే రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే, జస్టిన్ ట్రూడో స్థానంలో తదుపరి నాయకుడు ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. తదుపరి ప్రధాని రేసులో భారత సంతతి ఎంపీలతో పాటు పలువురు కీలక నేతలు ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?