NTV Telugu Site icon

Justin Trudeau: అమెరికాని ఓడించిన కెనడా.. ట్రంప్‌‌కి ట్రూడో స్ట్రాంగ్ రిఫ్లై..

Justin Trudeau

Justin Trudeau

Justin Trudeau: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెనడాని, ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోని టార్గెట్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో కెనడాని అమెరికాలో 51వ రాష్ట్రం కలపాలంటూ, ట్రూడో గవర్నర్ ‌గా ఉండాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్, కెనడా, అమెరికా ఫోర్ నేషన్స్ ఫేస్-ఆఫ్ ఫైనల్‌లో కెనడా, అమెరికా ఐస్ హాకీలో తలపడ్డాయి. ఈ పోటీలో అమెరికాను కెనడా ఓడించింది.

Read Also: Prabhas : ప్రభాస్ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్టర్..ఇక మామూలుగా ఉండదు

బోస్టన్‌లో జరిగిన ఐస్ హాకీ మ్యాచ్‌లో కెనడా 3-2 తేడాతో గెలిచిన కొద్దిసేపటికి ట్రూడో ఎక్స్ వేదికగా ట్రంప్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘‘మీరు మా దేశాన్ని తీసుకోలేరు. మీరు మా ఆటను తీసుకోలేరు’’ అని పోస్ట్ చేశారు. ట్రంప్ పదేపదే కెనడా గురించి చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ట్రూడో హాకీ మ్యాచ్‌ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఫైనల్‌కి ముందు ట్రంప్ అమెరికా జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కెనడా అమెరికాకు ‘‘51వ రాష్ట్రం’’గా మారాలనే కోరికను మరోసారి వెలిబుచ్చారు. ‘‘కెనడాపై అమెరికా గెలవాలి. ఏదో రోజు బహుశా త్వరలో, మన ప్రియమైన చాలా ముఖ్యమైన 51 రాష్ట్రంగా మారుతుంది’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, అమెరికా గవర్నర్ల సమావేశానికి ముందు, గవర్నర్ ట్రూడో మాతో చేరాలనుకుంటే ఆయనకు స్వాగతం అంటూ మరోసారి కెనడా ప్రధాని ట్రూడోపై వ్యంగ్యంగా మాట్లాడారు.