Site icon NTV Telugu

Trump-Canada: ట్రంప్ వార్నింగ్ ఎఫెక్ట్.. చైనాతో వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకున్న కెనడా

Trump

Trump

చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ట్రంప్ హెచ్చరికల తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందం కొనసాగించడం ఉద్దేశం లేదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది.

ఇటీవల చైనాతో కెనడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఈ వ్యవహారం ట్రంప్‌కు రుచించలేదు. కెనడాపై తీవ్రంగా మండిపడ్డారు. మాపై ఆధారపడి బ్రతుకుతూ ఏ మాత్రం కృతజ్ఞత లేదని.. అయినా ఏడాదిలోపే కెనడాను చైనా తినేస్తోందని బెదిరించారు. అంతేకాకుండా కెనడా వస్తువులపై 100 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ తాజాగా హెచ్చరించారు.

దీంతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెనకడుగు వేశారు. చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అమెరికా-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందానికే కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పారు. చైనా లేదా ఇతర ఏ మార్కెటేతర ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించే ఉద్దేశం లేదన్నారు. ట్రంప్ వార్నింగ్ చేసిన గంటల వ్యవధిలోనే మార్క్ కార్నీ నుంచి ఈ ప్రకటన రావడంతో అందర్నీ ఆశ్చర్య పరిచింది.

గ్రీన్‌లాండ్‌లో ‘గోల్డెన్ డోమ్’ ఏర్పాటుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ట్రంప్-కార్నీ మధ్య మాటల యుద్ధం నడిచింది. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో మొత్తానికి మార్క్ కార్నీ వెనక్కి తగ్గారు.

Exit mobile version