Nepal: నేపాల్‌లో తప్పిన విమాన ప్రమాదం.. రన్‌వేను దాటుకుని..!
- నేపాల్‌లో తప్పిన విమాన ప్రమాదం
- రన్‌వేను దాటుకుని భూమిలోకి దూసుకెళ్లిన ఫ్లైట్
- క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు, సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. భద్రాపూర్ విమానాశ్రయంలో బుద్ధ ఎయిర్ ఏటీఆర్ 72 విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి రన్‌వే నుంచి దూసుకెళ్లింది. ఒక నది వరకు దూసుకెళ్లి ఆగిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Off The Record: ముందస్తు ముచ్చట.. పట్టుదలగా మంత్రి తుమ్మల?
Also Read
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
- BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
- Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
- Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి!
బుద్ధ ఎయిర్ సంస్థ నడుపుతున్న టర్బోప్రాప్ ప్యాసింజర్ విమానం ఖాట్మండ్ నుంచి భద్రాపూర్‌కు బయల్దేరింది. విమానంలో 51 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. మంగళవారం భద్రాపూర్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను దాటుకుని భూమిలోకి దూసుకుపోయింది. దీంతో ప్రయాణికులంతా గజగజ వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియక హడలెత్తిపోయారు. ఒక నది ఒడ్డు వరకు వెళ్లి విమానం ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ప్రయాణికులను సురక్షితంగా దింపేశారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతింది.
ఇది కూడా చదవండి: Off The Record: “రెండు కళ్ల సిద్ధాంతం”.. పవన్ విషయంలో పార్టీ నేతలు, ఫ్యాన్స్ అంచనాలు తప్పుతున్నాయా?
ఇక ప్రమాదాన్ని అంచనా వేసేందుకు ఖాట్మండు నుంచి సాంకేతిక, సహాయ బృందాలను పంపినట్లు బుద్ధ ఎయిర్ తెలిపింది. అయితే వాతావరణ సమస్యలు, సాంకేతిక సమస్యలు కూడా ఏమీ లేనట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కారణమేంటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
🇳🇵⚡ Jhapa, Nepal: Buddha Air confirmed that its ATR aircraft operating from Kathmandu veered off the runway while landing at Bhadrapur Airport in Nepal.
⚠️ All 51 passengers and 4 crew members are safe. The aircraft reportedly stopped about 300 meters east of the runway. pic.twitter.com/ZKxJqrAF9h
— Osint World (@OsiOsint1) January 2, 2026
#FlightAlert
काठमाडौंबाट भद्रपुर उडान संख्या 901 जहाज 9N-AMF भद्रपुर विमानस्थलमा अवतरणका क्रममा रनवेबाट बाहिरिएको छ । सो जहाजमा 51 जना यात्रु रहेका थिए । यात्रु एवं चालक दल [४ जना] सबैजना सुरक्षित रहेका छन् ।काठमाडौंबाट अर्को जहाजमा टेक्निकल एवं रिलिफ टिम पठाउन लागिएको छ ।
— Buddha Air (@AirBuddha) January 2, 2026
తాజావార్తలు
-
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
-
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
-
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
-
BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!