NASA: సునీతా విలియమ్స్ లేకుండా సెప్టెంబర్ 6 తర్వాత భూమిపైకి స్టార్‌లైనర్..
- సెప్టెంబర్ 6 తర్వాతే భూమి పైకి బోయింగ్ స్టార్‌లైనర్..
- సునీతా విలియమ్స్ లేకుండా భూమికి రానున్న స్పేస్ క్యాప్యూల్..
- అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత స్టార్‌లైనర్‌లో వరస వైఫల్యాలు..
- 8 రోజుల్లో ముగియాల్సిన ఆపరేషన్ 9 నెలలకు చేరింది..
- ఫిబ్రవరి 2025 లో స్పేస్ ఎక్స్ ద్వారా భూమి మీదకు సునీతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NASA: బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్ ద్వారా ఇటీవల సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే, అనూహ్యంగా స్టార్‌లైనర్‌లో లీకులు ఏర్పడటంతో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే చిక్కుకుపోయారు. ఆమె వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఆమె అంతరిక్షంలోనే మరో ఆరు నెలల పాటు ఉంటుందని ఇటీవల నాసా ప్రకటించింది.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 6 తర్వాతే స్టార్‌లైనర్ భూమిపైకి వచ్చే అవకాశం ఉందని నాసా ప్రకటించింది. స్టార్‌లైనర్ అన్ డాకింగ్ ప్రక్రియ ఈ తేదీ కన్నా ముందు జరిగే అవకాశం లేదని గురువారం చెప్పింది. జూన్ నెలలో బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్యూల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ప్రారంభంలో ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ క్రూ-9 వెహికిల్ ద్వారా భూమి మీదకు తిరిగి రానున్నారు.
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
Read Also: Himanta Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. అస్సాం సీఎం సంచలన నిర్ణయం..
స్టార్‌లైనర్‌లో ప్రొపల్షన్ సిస్టమ్స్‌లో సమస్యలు ఏర్పడటంతో వ్యోమగాములు ఐఎస్ఎస్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్ నెలలో అక్కడికి వెళ్లిన 24 గంటల్లో క్యాప్యూస్లో వరసగా అవాంతరాలు ఎదురయ్యాయి. థ్రస్టర్లు విఫలమయ్యాయి. వీటిని ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో స్టార్‌లైనర్ ద్వారా సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్‌ని తీసుకురావడం ప్రమాదకరమని నాసా భావిస్తోంది. స్టార్‌లైనర్ వైఫల్యం కారణంగా 8 రోజుల్లోనే భూమి మీదకు తిరిగి రావాల్సిన వారు ఫిబ్రవరి 2025 వరకు అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తోంది.
స్టార్‌లైనర్ భూమికి తిరిగిరావడం కోసం అన్‌డాకింగ్ ప్రక్రియ నుంచి మెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్లో ల్యాండింగ్ వరకు సుమారు 6 గంటలు పడుతుందని నాసా ఒక బ్లాగ్‌లో తెలియజేసింది. నైరుతి అమెరికాలోని సురక్షితమైన ల్యాండింగ్ కోసం అన్ డాకింగ్, రీ ఎంట్రీ, పారాశూట్ సాయంతో ల్యాండింగ్‌కి అసవరమైన విన్యాసాలు అన్ని గ్రౌండ్ టీమ్ ద్వారా రిమోట్‌గా అంతరిక్ష నౌకకు దిశానిర్దేశం చేస్తాయి.
తాజావార్తలు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!