Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్‌ప్రెస్”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’పై బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ దాడికి పాల్పడింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్ ఆర్మీ సైనికులతో వెళ్తున్న ఈ రైలును బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుని, ఒక సిగ్నల్ క్రాసింగ్ వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో 24 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో పెషావల్ వెళ్తున్న అనేక మంది సైనికులు, ఈద్ కోసం వెళ్తున్న వారు ఉన్నారు. బీఎల్ఏ ఆత్మాహుతి దళం మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటన విడుదల చేసింది.
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.?
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
పాకిస్తాన్ లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణించే జాఫర్ ఎక్స్‌ప్రెస్ కీలక పట్టణాల నుంచి వెళ్తుంది. జకోబాబాద్, సుక్కూర్, రహీంయార్ ఖాన్, బహవల్పూర్, ముల్తాన్, లాహోర్, గుజ్రాన్వాలా, రావల్పిండి మీదుగా పెషావర్ వెళ్తుంది. పాకిస్తాన్లో ప్రధాన నగరాలను పట్టణాల గుండా వెళ్తుంది. ముఖ్యంగా కల్లోలిత, తిరుగుబాటు కలిగిన బలూచిస్తాన్‌లో పనిచేసేందుకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, పాక్ ఆర్మీ అధికారులు ప్రయాణించేందుకు ఈ రైలునే ఉపయోగిస్తారు. అందుకే ఈ ట్రైన్ టార్గెట్ అవుతుంది.
ముఖ్యంగా బలూచిస్తాన్ నుంచి పంజాబ్ వెళ్లేవారు చాలా మంది ఈ ట్రైన్లో ఉంటారు. పాక్ ఆర్మీలో పంజాబీలే అధికారం, వీరినే బీఎల్ఏ టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా ఈద్ సమయాల్లో తమ కుటుంబాలతో గడిపేందుకు పాక్ భద్రతాధికారులు ఈ ట్రైన్లో ప్రయాణిస్తుంటారు.
హైజాక్, వరస దాడులు:
ట్రైన్ హైజాక్ చేయడం చాలా అరుదుగా వింటుంటాం. 2025లో బీఎల్ఏ ఫైటర్స్ ఏకంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. బలూచిస్తాన్‌లో మారుమూల సిబీ రైల్వే స్టేషన్‌కు సమీపంలో దాడి చేసి రైలును నిలిపేశారు. బీఏల్ఏ ఏకంగా 450 మంది ప్రయాణికుల్ని బందీలుగా చేసుకుంది. .ఈ ఘటనలో దాదాపుగా 150 మందికి పైగా పాకిస్తాన్ సైనికుల్ని బీఎల్ఏ ఊచకోత కోసింది. పాక్ జైళ్లలో ఉన్న బీఎల్ఏ సభ్యుల్ని విడిపించాలనే షరతుకు పాక్ అంగీకరించలేదు. దీంతో పాక్ సైనికుల్ని హతమార్చింది.
నిజానికి 2024 నవంబర్ నెలలో క్వెట్టా రైల్వే స్టేషన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్ ఆర్మీ జవాన్లను టార్గెట్ చేస్తూ ఈ దాడిని బీఎల్ఏ నిర్వహించింది. ఈ ఘటనలో 60 మంది మరణించారు. అప్పటి నుంచి క్వెట్టా-పెషావర్ మధ్య రైలుని రద్దు చేశారు. మళ్లీ సర్వీస్‌ని పునరుద్ధరించారు. ప్రారంభించిన కొన్ని రోజులకే ట్రైన్ హైజాక్‌కి గురైంది. ఇదే కాకుండా చాలా సార్లు జాఫర్ ఎక్స్‌ప్రెస్ టార్గెట్‌గా పట్టాలపై బాంబులు పెట్టి నిలిపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!