Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా మరోసారి బిలావల్ భుట్టో..

Bilawal Bhutto

Bilawal Bhutto

Pakistan: పాకిస్తాన్‌లోని ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంత్రివర్గంలో బిలావల్ భుట్టో కీలక పదవి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన బిలావల్ భుట్టో మరోసారి ఇదే పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో బిలావల్ భుట్టో నేతృత్వంలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) అధికారం కోసం కూటమిగా ఏర్పడ్డాయి. బిలావల్ భుట్టోకి విదేశాంగ మంత్రి పదవి కల్పించేందుకు ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా ఉన్న ఇషాక్ దార్‌ని ఉప ప్రధాని చేశారు.

Read Also: Chennai: చెన్నైలో దారుణం.. 5 ఏళ్ల చిన్నారిపై కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్

క్యాబినెట్‌లో చేరేందుకు ముందుగా విముఖత ప్రదర్శించిన బిలావల్ తర్వాత విదేశాంగ మంత్రి అయ్యేందుకు అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారంలో బడ్జెట్ సమర్పించే లోపు పీపీపీ పార్టీని మంత్రివర్గంలో చేర్చుకోవాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోరినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇప్పటి వరకు విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇషాక్ దార్ ఈ పదవిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఇష్టమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను చూసుకోవాలని అనుకుంటున్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వంలో బిలావల్ భుట్టో 16 నెలల పాటు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

Exit mobile version