Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
- మధ్యవర్తిత్వం, దౌత్యం కడుపు నింపదు..
- పాకిస్తాన్ పరువు తీసిన సింగపూర్ మాజీ రాయబారి..
- దౌత్య విజయం అన్నం పెట్టదని ఘాటు వ్యాఖ్యలు..
- పాక్ పరిస్థితికి ఆ దేశ రాజకీయాలు, సైన్యమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి ‘‘మధ్యవర్తి’’గా వ్యవహరించామని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటోంది. తమ వల్లే యుద్ధం ఆగిందని సొంత దేశంలో భారీగా ప్రచారం చేసుకుంటుంది. పాకిస్తాన్ తనను తాను గొప్ప దౌత్యశక్తిగా ప్రదర్శించుకుంటోంది. అయితే, పాకిస్తాన్ గర్వాన్ని నేలకు దించుతూ సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘దౌత్య విజయం’’ పాకిస్తాన్‌కు అన్నం పెట్టదు అని ఆయన పేర్కొనడం పాకిస్తాన్ పరువును తీసేసింది.
ఒక ప్రపంచ సదస్సులో మాట్లాడుతూ.. ఇరాన్ సంక్షోభ సమయంలో పాకిస్తాన్ దౌత్యపరమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ, దీని వల్ల అమెరికా దృష్టిలో కాస్త ప్రతిష్ట పెరుగుతుందని కౌసికన్ అన్నారు. కానీ ఇది నిజమైన పాక్ సమస్యల్ని పరిష్కరించదని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ను వైఫల్యం అంచున్న ఉన్న దేశంగా అభివర్ణిస్తూ.. దాని సమస్య భారత్, ఆఫ్ఘనిస్తాన్ కదాని, దాని సొంత దేశ రాజకీయ నాయకులు, సైన్యమే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దుస్థితికి దాని విధానాలు, ఏళ్ల తరబడి దారుణమైన పాలనే కారణమని చెప్పారు.
Also Read
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
ప్రతీ దానికి భౌగోళిక పరిస్థితుల్ని నిందించడం, కేవలం సాకు మాత్రమే అని కౌసికన్ అన్నారు. పాకిస్తాన్లో పేలవమైన పాలన ఉందని, దాని నుంచి బయటపడే దారి ఏదీ కనిపించడం లేదని చెప్పారు. పాక్ రాజకీయ నాయకులందరూ కాలక్షేపం పనిచేసే వారని, పాక్ సమస్యలకు సైన్యం కూడా కారణమే అని అన్నారు. ఇటీవల మధ్యవర్తిగా దౌత్యవిజయం సాధించినప్పటికీ అమెరికా పాక్‌పై ఉన్న అన్ని ఆంక్షల్ని ఎత్తివేసే అవకాశం లేదని చెప్పారు.
A Pakistani journalist asks: Where will Pakistan be in 5 years?
Former Singapore diplomat Bilahari Kausikan replies bluntly: "Pakistan SEIZED a diplomatic moment in the US-Iran tensions, but that won’t FEED your people. It’s been on the brink of FAILURE for years." 🔥…
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 3, 2026
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!