Israel-Iran Conflict: ఇరాన్-ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 1 నాటి వైమానిక దాడికి ప్రతిగా ఆ రోజు ఇరాన్ నేరుగా ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. వందలాది డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. అయితే, ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటన్నింటిని ఆకాశంలోనే కుప్పకూల్చాయి. అయితే, ఈ దాడికి ఇజ్రాయిల్, ఇరాన్‌పై ప్రతిదాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ మాత్రం మా లక్ష్యాలు నెరవేరాయని, ఇది ఇరాన్ ఎంబసీపై దాడికి ప్రతీకారం అని, ఈ దాడి తర్వాత మళ్లీ ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేయవద్దని హెచ్చరించింది. ఒక వేళ దాడికి పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని ఇజ్రాయిల్‌ని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తమకు హాని కలిగించాలని చూసిన వారికి తాము హాని కలిగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలన్నీ ఈ ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాయి.
Read Also: Uttar Pradesh: 14 ఏళ్ల బాలికపై మతగురువు అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి అఘాయిత్యం..
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్‌కి మిత్రదేశం అమెరికా షాక్ ఇచ్చింది. ఇరాన్‌పై ఎదురుదాడికి ఇజ్రాయిల్ దిగితే, దాంట్లో మేము పాల్గొనమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూకు స్పష్టం చేసినట్లు సీఎన్ఎన్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఆదివారం నివేదించాయి. ఇజ్రాయిల్ తదుపరి ప్రతిస్పందన అనమసరమని బైడెన్ సూచించనట్లు తెలిపాయి. వైట్ హౌస్ యొక్క అత్యున్నత జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ ఆదివారం మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకోవడానికి అమెరికా సాయం చేస్తుంది, అయితే ఇరాన్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని అన్నారు. మేము మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను కోరుకోమని చెప్పారు.