NTV Telugu Site icon

Justin Trudeau: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాలకు ట్రూడో గుడ్ బై..

Justin

Justin

Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత దేశం, సొంత పార్టీతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌తో వైరం పెంచుకున్నాడు. ఖలిస్తానీవాదులకు మద్దతుగా నిలిచాడు. మరోవైపు ట్రంప్ గెలుపుతో అమెరికాతో కూడా వైరం పెంచుకున్నాడు. ఇక ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ట్రూడో గెలవడని అన్ని పోల్స్ చెబుతున్నాయి. అతడి పాపులారిటీ పడిపోయింది, దీంతో సొంత పార్టీ నుంచి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చాయి. చేసేదేం లేక తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

Read Also: Devendra Fadnavis: ముంబై సురక్షితమైన ప్రాంతం.. ఒక్క ఘటనతో విమర్శలు సరికాదు

ఇదిలా ఉంటే, తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వరస దెబ్బలతో సతమతమవుతున్న ట్రూడో, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజకీయాలను విడిచిపెట్టవచ్చని ప్రకటించారు. నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను అని ట్రూడో బుధవారం గ్లోబల్ న్యూస్ ఆఫ్ కెనడాకు చెప్పారు. రాజకీయాలను విడిచిపెట్టిన తర్వాత తాను ఏం చేయలో ఆలోచించడానికి తనకు ఎక్కువ సమయం లేదని ట్రూడో అన్నారు.

ట్రూడో కెనడా మంత్రులతో పాటు అమెరికాలోని కెనడా రాయబారిని కలిశారు. ట్రంప్ కెనడా దిగుమతులపై సుంకాలు వేస్తానని బెదిరించడంపై కెనడా ఎలా స్పందిస్తుందనేదానిపై చర్చించడానికి సమావేశాలు జరిగాయి. ట్రూడో తన లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా నాయకుడి పదవికి కూడా రాజీనమా చేయనున్నారు. కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు. ఆగస్టులో ఎన్నికలు జరిగే వరకు లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా కొనసాగుతారు. 2025 అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికల్లో పియరీ పొయిలివ్రే, అతని కన్జర్వేటివ్ పార్టీ ట్రూడో పార్టీ కన్నా ముందంజలో ఉందని పలు సర్వేలు చూపిస్తున్నాయి. వలసలు, ద్రవ్యోల్బణం, ఉపాధి, హౌసింగ్ సంక్షోభం వంటి కీలక విషయాల్లో ట్రూడో ప్రభుత్వం విఫలమైందని కెనడియన్లు భావిస్తున్నారు.

Show comments