NTV Telugu Site icon

Sheikh Hasina: షేక్ హసీనా పాస్‌పోర్టు రద్దు చేయాలని భారత్‌ను కోరిన బంగ్లాదేశ్

Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా-ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం సాగుతోంది. గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా.. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయితే తిరిగి తమకు అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్ కోరింది. కానీ అందుకు భారత్ అంగీకరించలేదు. ఈ మధ్యలో హసీనా పాస్‌పోర్టును ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఇటీవల హసీనా వీసాను భారత్ పొడిగించింది. తాజాగా ఆమె పాస్‌పోర్టును కూడా రద్దు చేయాలంటూ భారత్‌ను బంగ్లాదేశ్‌ కోరింది.

ఇది కూడా చదవండి: PM Modi: ‘‘మెలోడీ’’ మీమ్స్‌పై స్పందించిన ప్రధాని మోడీ.. ఏం చెప్పారంటే..

గతేడాది జూలై-ఆగస్టు మధ్య బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిది. అక్కడ నుంచి ఆమె భారత్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. ఆమెను అప్పగించేందుకు భారత్ అంగీకరించలేదు. దీంతో హసీనాతో పాటు మరో 96 మంది పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం గతంలో తెలిపింది. ఇందులో 75 మంది జూలైలో జరిగిన హింసతో సంబంంధం ఉన్నట్లుగా పేర్కొంది. అంతేకాకుండా హసీనాతో పాటు 11 మందిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాలకు నోటీసు పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహ్మద్ రఫీకుల్ ఆలం తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: జిన్‌పింగ్‌ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..

Show comments