Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో మరోసారి ఆందోళనలు.. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్
- బంగ్లాదేశ్‌లో మరోసారి కొనసాగుతున్న ఆందోళనలు..
- దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రిజైన్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్..
- నిరసనకారులను ఆపేందుకు బారికేడ్లను ఏర్పాటు చేసిన సైన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో మరోసారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు, నిరసనకారులు డిమాండ్ చేస్తూ అధ్యక్ష భవనం ‘బంగా భబన్’ను చుట్టుముట్టారు. షేక్ హసీనాను ప్రధాన మంత్రిగా తొలగించాలనే డిమాండ్‌లో నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘం మంగళవారం ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్ దగ్గర ర్యాలీ నిర్వహించాయి. అధ్యక్షుడి రాజీనామాతో సహా తమ డిమాండ్లను స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రకటించింది.
Read Also: IND vs AUS Test Series: నితీశ్ రెడ్డికి జాక్‌పాట్.. ఏకంగా టెస్టుల్లోకి ఎంట్రీ!
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఇక, ఆందోళనకారులు రాత్రి ‘బంగా భబన్’ మార్చ్‌గా వెళ్లగా.. రంగంలోకి దిగిన సైన్యం బారికేడ్లతో నిరసనకారులను ఆపేందుకు ప్రయత్నించారు. అధ్యక్ష పదవికి మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బంగా భవన్ బయట ఆందోళనకారులు గుమిగూడారు. అయితే, అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్.. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి స్నేహితుడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన వెంటనే రాజీనామా చేయాలని కోరారు. అలాగే, 1972 రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
అలాగే, షేక్ హసీనా హయాంలో 2014, 2018, 2024లో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని విద్యార్థి సంఘం నేతలు కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు జూలై-ఆగస్టు చేసిన తిరుగుబాటు స్ఫూర్తికి రిపబ్లిక్ బంగ్లాదేశ్‌గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ బంగ్లాకు 16వ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. అవామీ లీగ్ పార్టీ.. నామినేట్ చేయగా 2023 అధ్యక్ష ఎన్నికలలో షహబుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
🚨🇧🇩BANGLADESH: CALLS FOR PRESIDENT SHAHABUDDIN’S REMOVAL GROW
Protests intensify against President Shahabuddin, accusing him of backing "fascism" and demanding his resignation.
Source: Times of India pic.twitter.com/bzD4amPq7w
— Info Room (@InfoR00M) October 22, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..