Site icon NTV Telugu

Muhammad Yunus: షేక్ హసీనాను అప్పగించమంటే మోడీ ఏమన్నారంటే..! యూనస్ కీలక వ్యాఖ్యలు

Muhammadyunus

Muhammadyunus

ప్రధాని మోడీ గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అడిగితే మోడీ అంగీకరించలేదని తెలిపారు. గతేడాది పెద్ద ఎత్తున బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం జరిగింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో షేక్ హసీనా దేశాన్ని వదిలి భారత్‌కు వచ్చేశారు. అనంతరం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎన్నికయ్యారు. అనంతరం షేక్ హసీనాను బంగ్లాదేశ్ రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు.

ఇది కూడా చదవండి: A.A. Arts Mahendra : సీనియర్‌ నిర్మాత ఎ .ఎ. ఆర్ట్స్ మహేంద్ర కన్నుమూత

తాజాగా లండన్‌లోని చాఠమ్‌ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యూనస్‌ మాట్లాడారు. భారత్‌లో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని ప్రధాని మోడీని అడిగితే అందుకు అంగీకరించలేదని పేర్కొన్నారు. హసీనాను కట్టడి చేయాలని కోరగా అందుకు కూడా అంగీకరించలేదని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Rains : తెలంగాణలో జూన్ 15 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

బిమ్‌స్టెక్ సదస్సులో ప్రధాని మోడీతో షేక్ హసీనా గురించి మాట్లాడానని.. ఆన్‌లైన్‌లో హసీనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని.. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారని తెలియజేసినట్లు చెప్పారు. ఆమె ప్రకటనలు, ప్రసంగాలు అడ్డుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. అందుకు మోడీ.. అది సోషల్ మీడియా.. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదని చెప్పినట్లు వెల్లడించారు.

షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించేందుకు సుముఖంగా లేనట్లు కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటికే భారత్‌కు లేఖ రాశామని.. ఇప్పటికీ చట్టపరమైన చర్యలు జరుగుతున్నాయని వెల్లడించారు. హసీనా చేసిన నేరాలకు నోటీసులు కూడా పంపించామని.. ఆమెకు సంబంధించిన నేరాలు ఇంకా వస్తూనే ఉన్నాయని తెలిపారు. చట్టబద్ధంగానే ఆమెను బంగ్లాదేశ్‌కు తీసుకురావాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. పొరుగు దేశమైన భారత్‌తో మంచి సంబంధాలు ఉండాలనే కోరుకుంటున్నామని.. కానీ భారత పత్రికలు నకిలీ వార్తలు సృష్టిస్తున్నాయని యూనస్ ఆరోపించారు.

Exit mobile version