Site icon NTV Telugu

Bangladesh: అవమానాలు మరిచిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్‌తో తొలిసారిగా వాణిజ్యం..

Pak Bangla

Pak Bangla

Bangladesh: 1971లో విడిపోయిన తర్వాత తొలిసారి బంగ్లాదేశ్, పాకిస్తాన్ తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను పున:ప్రారంభించాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత మొదటి కార్గో పోర్ట్ ఖాసిం నుంచి బయలుదేరినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభంలో బంగ్లాదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ (TCP) ద్వారా 50,000 టన్నుల పాకిస్తానీ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్‌కి చెందిన నౌక బంగ్లాదేశ్ ఓడరేవుకు వెళ్తున్నట్లు మీడియా వెల్లడించింది. రెండు దశల్లో 25,000 టన్నుల చొప్పున ఈ బియ్యాన్ని పాకిస్తాన్ బంగ్లాదేశ్‌కి పంపించనుంది.

Read Also: Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం.. ఆ దేశానికి ఎందుకు సాయం చేయాలంటూ ట్రంప్ ఫైర్..

షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, మహ్మద్ యూనస్ ఆ దేశ ప్రభుత్వానికి తాత్కాలిక అధిపతి అయ్యారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతున్నాయి. చివరకు బంగ్లా సైన్యానికి పాకిస్తాన్ శిక్షణ ఇచ్చేంత వరకు ఈ స్నేహ సంబంధాలు వచ్చాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారులు కూడా బంగ్లాదేశ్‌లో పర్యటించడం భారత్‌కి ఆందోళన కలిగించే విషయం. బంగ్లా సైనిక అధికారులు పాకిస్తాన్ వెళ్లి అక్కడి సైన్యంతో భేటీ అయ్యారు.

1970లలో పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశీయులపై చేసిన దురాగతాలను, అత్యాచారాలను మరించిపోయి, ఇప్పుడు పాకిస్తాన్ స్నేహం కోసం ఆ దేశం చాలా ఆసక్తి చూపిస్తోంది. అనేక మంది బెంగాలీలను ఊచకోత కోసింది. లక్షల్లో మరణాలు సంభవించాయి. ఈ అవమానాలు అన్నింటిని బంగ్లాదేశ్ ప్రస్తుతం మరిచిపోయినట్లుంది. ఇక బంగ్లాదేశ్‌లో మతఛాందసవాదం, ర్యాడికల్ ఇస్లామిక్ సంస్థల ఉన్మాదం క్రమంగా పెరిగిపోతోంది. రానున్న రోజుల్లో మరో పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్ మారే పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version