Site icon NTV Telugu

Bangladesh Elections 2026: బంగ్లా ఎన్నికల్లో “భారత బద్ధ వ్యతిరేకి” ఘన విజయం..

Bangladesh

Bangladesh

Bangladesh Elections 2026: బంగ్లాదేశ్ 18 నెలల అస్థిరత తర్వాత, దేశ దశా దిశను మార్చే ఎన్నికలు ఈ రోజు(ఫిబ్రవరి 12)న జరిగాయి. పలు చోట్ల ఘర్షణలు జరిగినా, పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహం చూపారు. తాజాగా, ఓట్ల కౌంటింగ్ మొదలుకావడంతో ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల్లో కూడా రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది.

Read Also: Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ విద్యార్థినేత, భారత బద్ధ వ్యతిరేకి హస్నత్ అబ్దుల్లా భారీ మెజారిటీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించారు. కోమిల్లా-4 పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేశారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘‘బంగ్లాదేశ్‌ను అస్థిరపరిస్తే, ప్రతిఘటన అగ్ని సరిహద్దులు దాటి వ్యాపిస్తుంది. మీరు మమ్మల్ని అస్థిరపరిచే వారికి ఆశ్రయం ఇస్తున్నందున, మేము సెవెన్ సిస్టర్స్ వేర్పాటువాదులకు కూడా ఆశ్రయం ఇస్తాము’’ అని హెచ్చరించాడు. నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) అభ్యర్థిగా ఉన్న అబ్దుల్లాకు 1,72,000 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్తి జాసిముద్దీన్‌కు 26,000 ఓట్లు వచ్చినట్లు అక్కడి మీడియా నివేదించింది. జమాత్ నేతృత్వంలోని 11 పార్టీల కూటమిలో ఎన్సీపీ కూడా ఉంది. ఏకంగా 1.42 లక్షల ఓట్ల మెజారిటీ అబ్దుల్లా గెలుపొందారు.

Exit mobile version