BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
- పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ..
- బలూచ్ రెబల్స్ జరిపన దాడుల్లో 25 మంది జవాన్లు హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BLA Attack: పాకిస్తాన్ సైన్యానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) చుక్కలు చూపిస్తోంది. రెండు వేర్వేరు దాడుల్లో 25 మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లు చెప్పింది. బీఎల్ఏ దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. బలూచిస్తాన్‌లో డ్యూటీ అంటేనే వెళ్లేందుకు పాక్ సైనికులు భయపడుతున్నారు. వీలైతే సెలవు, కాదంటే రిజైన్ చేస్తున్నారు. తాజా దాడికి సంబంధించి బీఎల్ఏ ఒక వీడియోను రిలీజ్ చేసింది. పాకిస్తాన్ సైనికుల ట్రక్కును సినిమా తరహాలో దాడి చేసింది. జియారత్ క్రాస్ వద్ద తమ ‘ఫతే స్క్వాడ్’ యోధులు సైనిక కాన్వాయ్‌పై మెరుపుదాడి చేసి రెండు వాహనాలను ధ్వంసం చేశారని శుక్రవారం బీఎల్ఏ ప్రకటించింది. ఈ దాడిలో 18 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని బీఎల్ఏ పేర్కొంది. మరో ఐదుగురు పాకిస్తానీ సైనికులు తప్పించుకునే క్రమంలో గాయపడ్డారని తెలిపింది.
బీఎల్ఏ అధికారిక మీడియా హక్కల్ మంటల్లో కాలిపోతున్న పాక్ సైనిక వాహనాన్ని చూపించింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు, పాకిస్తాన్ సైన్యం మరణించిన జవాన్లను శవపేటికల్లో ఉంచి, ప్రార్థనలు చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. ఫతే స్వ్కాడ్ బీఎల్ఏలో స్పెషల్ పోరాట దళంగా పనిచేస్తోంది. కొండలతో కూడి ఉన్న బలూచిస్తాన్‌లో గెరిల్లా యుద్ధం, ఆకస్మిక దాడులకు పేరుపొందింది. 2025 మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ చేసింది కూడా ఈ దళమే.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
సురబ్లోని హజికాలో జరిగిన మరో దాడిలో తమ STOS యూనిట్ (స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్) రిమోట్ కంట్రోల్ వాహనాన్ని ఉపయోగించి పేలుడు జరిపిందని, ఈ దాడిలో ఏడుగురు పాకిస్తానీ సైనికులు మరణించారని BLA ప్రకటించింది. అయితే, పాక్ ఆర్మీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి మృతుల సంఖ్యను చెప్పలేదు. గత కొన్ని నెలల్లో పాక్ సైన్యంపై మొత్తం 36 ఆపరేషన్లు చేపట్టి 33 మందికి పైగా సైనికుల్ని హతమార్చినట్లు బీఎల్ఏ చెప్పింది.
ఇదిలా ఉంటే, బీఎల్ఏపై ప్రతీకారం తీర్చుకున్నట్లు పాక్ సైన్యం చెప్పింది. గత 72 గంటల్లో బలూచిస్తాన్‌లోని మస్తుంగ్, సిబి, క్వెట్టా, కలాత్ జిల్లాలో మిలిటెంట్ల స్థావరాలపై జరిపిన దాడుల్లో 48 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు చెప్పింది. హతమైన వారిలో నిషేధిత బీఎల్ఏ, తెహ్రీక్ ఏ తాలిబాన్(టీటీపీ)కి చెందిన వారు ఉన్నారని ప్రకటించింది.
📍 Ziarat Ambush, Balochistan.
BLA releases videos of Ziarat attack on Pak army convoy. More than 25 pak army's foot soldiers killed while big generals enjoy their luxurious life in DHA.
BLA warns more attacks. pic.twitter.com/nyo1tIeOpg
— Sagar STORM🔳 (@AlexAllone1) September 5, 2026
తాజావార్తలు
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!