Balochistan: పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషర్ ఆర్మీ(BLA) పోరాటం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బలూచ్ ఫైటర్ల ధాటికి పాకిస్తాన్ సైన్యం కూడా వణికిపోతోంది. ముఖ్యంగా, ఇద్దరు మహిళా ఆత్మాహుతి యోధులు చేసిన పోరాటం ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరిద్దరికి సంబంధించిన వీడియో పాక్‌తో పాటు భారత్‌లో వైరల్‌గా మారింది. బీఎల్ఏ పాక్‌కు వ్యతిరేకంగా ‘‘ఆపరేషన్ హెరోఫ్’’ని ప్రారంభించింది. గ్వాదర్ ఫ్రంట్‌లో పాక్‌కు వ్యతిరేకంగా పాకిస్తానీ భద్రతా బలగాలపై ఇద్దరు మహిళలు జరిపిన పోరాటం జరిపారు.
చివరకు వీరోచిత పోరాటంలో వీరిద్దరు కూడా వీర మరణం పొందారు. గత రెండు రోజులుగా బలూచిస్తాన్‌లో బలూచ్ ఆర్మీ సమన్వయ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో చాలా మంది పాక్ సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున బీఎల్ఏ ఫైటర్స్ మరణించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న మహిళ హవా బలూచ్ అని బీఎల్ఏ చెప్పింది.. తమ సైన్యంపై దాడిలో మహిళలు పాల్గొన్నట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. మరో యోధురాలిని అసిఫా మెంగల్ అని బీఎల్ఏ చెప్పింది.
Read Also: TVS Raider 125: భారీగా పెరిగిన టీవీఎస్ రైడర్ 125 ధరలు.. ఏ వేరియంట్ ధర ఎంత పెరిగిందంటే?
పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొంటున్న వీడియోలో, వీరిద్దరు బలూచ్ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ‘‘బలూచ్ జాతి ప్రజలారా, ఈ రోజు మీ సోదరీమణులలో ఒకరు పంజాబీ సైన్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీరు ధైర్యంతో ముందుకు రావాలి. మనకు వేరే మార్గం లేదు. తమను ఎదుర్కోవడానికి పాక్ ఆర్మీ భయంతో ముందుకు రావడం లేదు. పాక్ మనల్ని ఎదుర్కోలేదు’’ అని చెప్పడం వినవచ్చు. ‘‘ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. మనం శత్రువులను ఎదుర్కొంటున్నాము. ఈ రోజు బలూచ్ మహిళల్ని వారు తేలికగా తీసుకోలేరని చూపిస్తాం’’ అని పేర్కొంది. యుద్ధం ఎలా ఉందని వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి అడిగితే.. సరదాగా ఉందని ఆమె సమాధానం ఇచ్చింది. గ్వాదర్ ఫ్రంట్ సమీపంలో పాకిస్తాన్ భద్రతా సిబ్బందిని తమ బృందం చంపిందని ఆమె చెప్పింది.
‘‘బలూచ్ జాతీ మేల్కోవాలి. బలూచ్ యోధులు ఒకరితో ఒకరు నిలబడాలి. శత్రువులు(పాకిస్తాన్) రోజులు లెక్కించుకోవాలి. వారికి అంత బలం లేదు. బలోచ్ జాతి శత్రువులకు ఎప్పటికీ తలవంచదు. ఈరోజు యోధులు తమ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. తమను తాము ముక్కలు చేసుకుంటున్నారు. కొందరు ఇప్పటికీ డబ్బుల కోసం పాక్ తరుపున గూఢచర్యం చేస్తున్నారు’’ అని అన్నారు. వీడియో చివరలో హవా బలూచ్ పోరాటంలో మరణించిన విజువల్స్‌తో వీడియో పూర్తయింది.
మీడియా కథనాల ప్రకారం, హవా బలూచ్ ఒక జెన్ జీ యువతి. ఆమె తండ్రి 2021లో పాక్ భద్రతా బలగాల చేతిలో మరణించారు. ఈయన కూడా బీఎల్ఏ యోధుడే. తాజాగా జరిగిన దాలుల్లో పాక్ సైన్యం చెబుతున్న దాని ప్రకారం, శనివారం 92 మంది వేర్పాటువాదులు, శుక్రవారం 41 మంది మరణించినట్లు చెప్పింది. అయితే, బీఏఏ మాత్రం 18 మంది తమ వారు చనిపోయినట్లు వెల్లడించింది.
Baloch Liberation Army Video:
“During Operation Herof, Phase Two at the Gwadar Front, Fidayee Hawa Baloch fought selflessly, shoulder to shoulder with fellow Fidayeen. This was her final message, sent twelve hours before her martyrdom.” pic.twitter.com/tedajNIjkD
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 2, 2026