China: కిండర్‌గార్టెన్‌పై యువకుడి దాడి.. కత్తిపోట్లతో ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో కిండర్‌గార్టెన్‌పై ఆగంతక యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో ఆరుగురు మృతి చెందారు. చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని లియాన్‌జియాంగ్ కౌంటీలో కిండర్‌గార్టెన్‌లోకి చొరబడిన ఓ 25 ఏండ్ల వ్యక్తి.. అందులో ఉన్నవారిపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. ఆగంతుకుడి దాడిలో ఆరుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానితుడిని అరెస్టు చేశారు.
Read also: MS Dhoni Run-Out: కోట్లాది మంది భారతీయులు హర్ట్.. విలన్ మార్టిన్ గప్టిల్! వీడియో వైరల్
Also Read
దాడికి పాల్పడిన యువకుడు లియాన్‌జియాంగ్‌కు చెందినవాడిగా గుర్తించారు. అతడు ఊ అనే ఇంటి పేరు కలిగి ఉన్నాడని తెలిపారు. అయితే అతడు కిండర్‌గార్టెన్‌పై ఎందుకు దాడిచేశాడనే కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు తమ అదుపులోనే ఉన్నాడని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నది. ఇప్పటివరకు 130 మిలియన్ల మంది దీనిని వీక్షించారు. బాధితుల్లో పెద్దలు, పిల్లలు కూడా ఉన్నారని మీడియా పేర్కొంది. చైనాలో కఠినమైన తుపాకీ చట్టాలు మరియు కట్టుదిట్టమైన భద్రత కారణంగా హింసాత్మక నేరాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రీ-స్కూల్లలో అనేక కత్తిపోట్లు సంఘటనలు జరిగాయి. గత ఏడాది ఆగస్టులో జియాంగ్జి ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌లో జరిగిన కత్తిపోట్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. 2021లో గ్వాంగ్జీలోని నైరుతి ప్రాంతంలోని కిండర్ గార్టెన్‌లో ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను చంపి 16 మందిని గాయపరిచాడు. సోషల్ మీడియాలో కొంత మంది నెట్ జన్లు నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!