Super-Earths: రెండు భారీ “భూ గ్రహాల”ను గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Astronomers Discovers 2 Super-Earths: అనంత విశ్వంలో భూమిలాంటి గ్రహాలను కనుక్కునేందుకు అనేక ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. భూమి లాగే నివాసయోగ్యానికి అనుకూలంగా ఉండే గ్రహాలు, భూమి లాగే హాబిటేబుల్ జోన్ లో ఉండే గ్రహాలను గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని ఎక్సో ప్లానెట్స్ ను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిని పోలిన భారీ భూ గ్రహాలను(సూపర్ ఎర్త్) గుర్తించారు. అయితే అవి పూర్తిగా మానవ ఆవాసానికి అనుకూలంగా లేవు. అక్కడ జీవం ఉందా..? లేదా..? అని గుర్తించలేకపోయారు.
ఇదిలా ఉంటే తాజాగా భూమికి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహం చుట్టూ తిరుగుతున్న భూమిని పోలిన గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో ఒకటి భూమి కన్నా 30 శాతం పెద్దదిగా ఉంది. ఇది తన మరగుజ్జు నక్షత్రం చుట్టూ కేవలం 2.7 ఎర్త్ డేస్ లోనే చుట్టూ తిరుగుతోంది. మరొక గ్రహం భూమికన్నా 40 శాతం పెద్దదిగా ఉంది. ఇది తన నక్షత్రం చుట్టూ కేవలం 8.5 భూమి రోజుల్లోనే కక్ష్యను పూర్తి చేస్తోంది. వీటికి ఎల్పీ 890-9బీ, ఎల్పీ 890-9సీగా పేర్లు పెట్టారు. అయితే ఇందులో రెండో గ్రహం తన మాతృ నక్షత్రానికి నివాసయోగ్యమైన జోన్ లో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రెండు గ్రహాలను నాసా, ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్(టీఈఎస్ఎస్) గుర్తించింది.
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
Read Also: Gender Equality: లింగ సమానత్వం సాధించడానికి మరో 300 ఏళ్లు.. యూఎన్ఓ నివేదిక
గ్రహాలు వాటి నక్షత్రాల ముందు నుంచి వెళ్లినప్పుడు వెలువడే కాంతిని విశ్లేషించి అవి నివాసానికి యోగ్యంగా ఉన్నాయా..? హబిటబుల్ జోన్ లో ఉన్నాయా.? అనే వివరాలను విశ్లేషిస్తుంటారు శాస్త్రవేత్తలు. గ్రహాల లక్షణాలు, స్వభావాన్ని గుర్తిస్తుంటారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు గుర్తించిన ఎక్సో ప్లానెట్స్ భూమి నుంచి కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అంటే కాంతి వేగంతో సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే కొన్ని వందల ఏళ్ల తరువాత ఆ గ్రహాలను చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పడున్న టెక్నాలజీ ప్రకారం ఇది దాదాపుగా అసాధ్యం.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!