Pakistan: ముస్లింలకు ముప్పుగా “హిందూ-యూదు కూటమి”.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
- హిందూ-యూదు కూటమితో ముస్లింలకు ముప్పు..
- టెహ్రాన్ మీటింగ్‌లో అసిమ్ మునీర్ వ్యాఖ్యలు..
- మునీర్ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పిన ఇరాన్ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌కు కొత్త భయాలు మొదలయ్యాయి. భారత్-ఇజ్రాయిల్ సంబంధాలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇరాన్ భద్రతా అధికారి మొహ్సేన్ రెజాయీ వెల్లడించారు. హిందువులు, యూదుల మధ్య పెరుగుతున్న సంబంధాలు ముస్లింలకు, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మారుతున్నాయని మునీర్ హెచ్చరించినట్లు ఆయన అన్నారు. అక్టోబర్ 26న ఇరాన్ రాజధాని టెహ్రాన్ వేదికగా జరిగిన నాలుగు దేశాల భద్రతా సమావేశంలో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారని రెజాయీ వెల్లడించినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.
టెహ్రాన్ వేదికగా 4 ముస్లిం దేశాల సమావేశం..
ఇజ్రాయిల్, అమెరికాతో ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్టోబర్ 26న టెహ్రాన్‌లో ఇరాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ ప్రతినిధులు సమావేశమయ్యారు. పాకిస్తాన్ తరుఫున అసిమ్ మునీర్, టర్కీ తరఫున ఇంటెలిజెన్స్ చీఫ్ ఇబ్రహీం కలిన్ హాజరయ్యారు. సౌదీ అరేబియా తరఫున రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్, ఇరాన్ తరఫున భద్రతా అధికారి మొహ్సేన్ రెజాయీ పాల్గొన్నారు.
Also Read
- Florida Plane Crash: ఫ్లోరిడా ప్లేన్ క్రాష్.. లవర్‌కు పైలట్ చివరి మెసేజ్.. టెక్ వ్యాపారవేత్త కుటుంబం దుర్మరణం..
- Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
- Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. ఓ నావికుడు మృతి
అక్టోబర్ 31న ఇరాన్ ప్రభుత్వ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయీ ఈ సమావేశం గురించి మాట్లాడారు. పాకిస్తాన్, టర్కీ, సౌదీలు ఇజ్రాయిల్ నుంచి ఎదురవుతున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశాయి. ‘‘ముస్లింలకు, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా హిందువులు-యూదుల మధ్య ఏర్పడుతున్న సంబంధాల గురించి అసిమ్ మునీర్ మాట్లాడారు’’ అని రెజాయీ చెప్పారు.
పాకిస్థానీ జర్నలిస్ట్ నజామ్ సేథీ కూడా రెజాయీ వెల్లడించిన విషయాలపై తన యూట్యూబ్ కార్యక్రమంలో చర్చించారు. హిందువులు, యూదుల మధ్య కూటమి తమకు పెద్ద ముప్పుగా మారుతుందని మునీర్ హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇండియా-ఇజ్రాయిల్ బంధం బలోపేతం..
భారత్-ఇజ్రాయిల్ మధ్య దశాబ్దాలుగా సైనిక, రక్షణ, టెక్ భాగస్వామ్యం కొనసాగుతోంది. వ్యవసాయం, నీటి నిర్వహణలో ఇజ్రాయిల్ భారత్‌కు సహకరిస్తోంది. 2026 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి. 2025 మేలో పాకిస్తాన్‌పై భారత్ జరిపిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులకు ఇజ్రాయిల్ బహిరంగంగా మద్దతు తెలిపింది.
2026 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ తదితర దేశాలతో కూడిన ‘హెక్సాగన్ ఆఫ్ అలయెన్సెస్’ ప్రతిపాదనను ప్రస్తావించారు. రాడికల్ షియా, సున్నీ కూటములను ఎదుర్కొనేందుకు ఈ భాగస్వామ్యాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
మునీర్ భారత-హిందూ వ్యతిరేకత..
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బహిరంగంగానే భారత్, హిందూ వ్యతిరేకతను కనబరుస్తున్నారు. పలు సందర్భాల్లో హిందువుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు, ముస్లింలు మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాల పరంగా భిన్నమైన సమూహాలని మునీర్ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందు కూడా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడిగా అభివర్ణించిన కొన్ని రోజులకే పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pakistan: ముస్లింలకు ముప్పుగా “హిందూ-యూదు కూటమి”.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
-
Water Tankers Strike: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
-
AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
Shraddha Walkar Case: శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడు అఫ్తాబ్‌కు భద్రత పెంపు!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!