NTV Telugu Site icon

Greenland: గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్లాన్.. వాస్తవానికి ఆ ద్వీపం ఏ దేశానికి చెందినదంటే ?

Greenland

Greenland

Greenland: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన పనామా కాలువు, కెనడా, గ్రీన్‌ల్యాండ్ ప్రకటనలు సంచలనంగా మారాయి. గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో, యూరప్‌కి వాయువ్యంగా ఉన్న వ్యూహాత్మకంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు.

నిజానికి గ్రీన్‌ల్యాండ్ ఎవరికి చెందుతుంది, ఏ దేశంతో ట్రంప్ చర్చలు జరపాల్సి ఉంటుందనేది ఆసక్తిగా మారింది. విశాలమైన ఈ భూభాగంలో సహజ సందపకు కొదువ లేదు. దీంతో పాటు ఇది ఉన్న ప్రాంతం వ్యూహాత్మకం కీలకమైంది.

1) డెన్మార్క్, నార్వేలు కలిసి డానో -నార్వేజియన్ రాజ్యం నుంచి చాలా మంది అన్వేషకులు, స్థిరనివాసులు గ్రీన్‌ల్యాండ్ వెళ్లారు. దీనిని అప్పట్లో కలాలిట్ నునాట్ అని పిలిచేవారు. ఆ తర్వాత ఈ రాజ్యానికి గ్రీన్‌ల్యాండ్‌పై సార్వభౌమాధికారం దక్కింది. 1814లో డెన్మార్క్, నార్వే విడిపోయినప్పుడు గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ కిందకు వచ్చింది.

2) డెన్మార్క్‌ని నాజీ జెర్నామీ స్వాధీనం చేసుకునే వరకు గ్రీన్‌ల్యాండ్ దాదాపుగా 140 ఏళ్లు డెన్మార్క్ పాలన కింద ఉంది. ‘‘ఆపరేషన్ వెసెరుబంగ్’’ అనే కోడ్ నేమ్‌తో నాజీ జర్మనీ 1941న డెన్మార్, నార్వేలపై దాడి చేసింది. ఒక రోజులోనే డెన్మార్క్ లొంగిపోయింది. ఈ కాలంలో గ్రీన్‌ల్యాండ్ జర్మనీలో భాగమైంది. అయితే, గ్రీన్‌ల్యాండ్ వ్యూహాత్మక ప్రాధాన్యత తెలుసుకున్న అమెరికా, జర్మనీ సైనికులు రాకముందే గ్రీన్‌ల్యాండ్‌ని ఆధీనంలోకి తీసుకుంది.

3) గ్రీన్ ల్యాండ్ అమెరికాలో భాగమైన తర్వాత, 1940 -45 మధ్య ఐదేళ్లు అమెరికా నియంత్రణలోనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో హిట్లర్ మరణించిన తర్వాత, డెన్మార్ మే 5, 1945న జర్మనీ ఆక్రమణ నుంచి విముక్తి పొందించింది. ఆ తర్వాత అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ని డెన్మార్క్‌కి ఇచ్చింది. 3లో, డెన్మార్క్ అధికారికంగా గ్రీన్‌ల్యాండ్‌ను తన దేశంలో భాగంగా విలీనం చేసింది. ఇది గ్రీన్‌ల్యాండ్‌లోని ప్రజలను డెన్మార్క్ పౌరులుగా చేసింది.

4) అయితే, నార్వేజియన్ సముద్రం(అట్లాంటిక్ మహాసముద్రం) మీదుగా 3000 కి.మీ దూరంలో ఉన్న గ్రీన్ ల్యాండ్ పాలన డెన్మార్క్‌కి ఇబ్బందికరంగా మారింది. దీంతో గ్రీన్ ల్యాండ్ లోని ప్రజలు సంతోషంగా లేకపోవడంతో మే 1, 1979న పాలనని అక్కడ ప్రజలకు డెన్మార్క్ అప్పగించింది. అయితే, విదేశాంగ వ్యవహారాలు, భద్రత మాత్రం డెన్మార్ తన ఆధీనంలో ఉంచుకుంది. నేటి వరకు పరిస్థితి ఇలానే ఉఎంది. గ్రీన్ ల్యాండ్‌కి సొంత పార్లమెంట్ ఉన్నప్పటికీ, ఇద్దరు ఎంపీలను డెన్మార్క్ పార్లమెంట్‌కి పంపుతుంది.

5) ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో గ్రీన్‌ల్యాండ్‌లో సైనిక స్థావరం ‘పిటుఫిక్’, బాలిస్టిక్ కమాండ్, ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అమెరికా డెన్మార్క్‌తో ఒప్పందం చేసుకుంది. అయితే, దీనిపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. US తన అణ్వాయుధ నిల్వలను గ్రీన్‌ల్యాండ్‌లో పెద్ద మొత్తంలో నిల్వ చేయడం ప్రారంభించింది, 1968లో, నాలుగు హైడ్రోజన్ బాంబులతో కూడిన US మిలిటరీ జెట్ గ్రీన్‌ల్యాండ్‌లో కూలిపోయింది.

6) 1960-1970లలో సామూహిక గర్భనిరోధక కుంభకోణం గ్రీన్ ల్యాండ్‌ని కుదిపేసింది. దీంతో గ్రీన్ ల్యాండ్, డెన్మార్క్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. డెన్మార్ ప్రధానిని గ్రీన్ ల్యాండ్ నిందించింది. దీనిని సామూహిక హత్య, జాతి హత్యగా అభివర్ణించింది.

7) అయితే, నేటికి గ్రీన్ ల్యాండ్ విదేశాంగ విధానం, భద్రతను డెన్మార్ నియంత్రిస్తోంది. ఇప్పుడు ట్రంప్ గ్రీన్ ల్యాండ్‌లో చర్చలు జరపాలంటే డెన్మార్క్‌తోనే చర్చించాల్సి ఉంటుంది. ఈ గ్రీన్ ల్యాండ్ విషయంలో డెన్మార్క్‌దే తుదినిర్ణయం అవుతుంది.

8) గ్రీన్ ల్యాండ్‌ని కొనుగోలు చేయాలని ట్రంప్ 2019లోనే అనుకున్నారు. దీనిపై తన సలహాదారులను కూడా అడిగారు. దీనిని అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఒప్పందం అని పిలిచారు. గ్రీన్‌ల్యాండ్ చాలా వనరులు అధికంగా ఉన్న ద్వీపం. ఇది చమురు, గ్యాస్ నిల్వలతో సమృద్ధిగా ఉంది. రేర్ ఎర్త మెటీరియల్ లభ్యం అవుతుంది. చైనాకు కూడా గ్రీన్ ల్యాండ్‌పై కన్నుంది. ప్రపంచంలో కీలకమైన ముడి పదార్థాల ఎగుమతిని చైనా నియంత్రిస్తోంది. దీనిని అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. అవసరమైతే సైన్యాన్ని ఉపయోగించి గ్రీన్ ల్యాండ్‌ని నియంత్రించాలని ట్రంప్ అనుకుంటున్నారు.

Show comments