NTV Telugu Site icon

Ayodhya Ram Temple: రామమందిరంపై యూఎన్‌కి పాకిస్తాన్ మొర.. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోగలదా.?

Ram Mandir

Ram Mandir

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ కడుపు మండుతోంది. దేశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, పలువురు ముస్లింలు మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పటికీ.. పాకిస్తాన్ భారత్‌పై విషప్రచారం చేస్తూనే ఉంది. ఇండియాలో మైనారిటీలో రక్షణ లేదు, ఇండియాలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతోందంటూ అసత్య మాటలు చెబుతోంది. మైనారిటీ హక్కుల్ని హరిస్తూ, ముస్లిం దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇండియాకు సెక్యులరిజంపై నీతులు చెబుతోంది.

అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని యావత్ దేశం పండగలా జరుపుకుంది. దీన్ని చూసిన పాక్ తట్టుకోలేకపోతోంది. తాజాగా రామ మందిర నిర్మాణంపై ఐక్యరాజ్య సమితి(యూఎన్)లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ అధికారికంగా యూఎన్‌కి లేక రాసింది. రామ మందిరంపై ఐక్యరాజ్య సమితితో మొరపెట్టుకుంది. తినడానికి తిండి లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా కూడా పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్‌ని అభాసుపాలు చేసే పనులు చేస్తోంది.

Read Also: PM Modi: నితీష్ కుమార్, ఎన్డీయే ప్రభుత్వానికి ప్రధాని మోడీ అభినందనలు..

యూఎన్‌కి పాక్ ఏమని ఫిర్యాదు చేసింది..?

భారత్‌లో బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిరాన్ని నిర్మించి, ప్రతిష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యూఎన్‌కి పంపిన లేఖలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ రాశారు. ఈ ధోరణి భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం, శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని ఆరోపించారు. భారత్ ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణను నిర్ధారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

భారత్‌లో ఇతర మసీదులు కూడా ఇదే రకమైన బెదిరింపులు ఎదుర్కొంటున్నాయని, వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు మరియు మథురలోని షాహీ ఈద్గా మసీదుతో సహా ఇతర మసీదులు కూడా అవమానాలు, విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో పాక్ పేర్కొంది. అయితే, ఇది భారత అంతర్గత విషయం కాబట్టి యూఎన్ ఇందులో కలుగజేసుకునే అవకాశం లేదు. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు అనంతరమే రామ మందిర నిర్మాణం జరిగింది.