Elon Musk: ఇటు ఆనంద్ సెటైర్.. అటు ట్విటర్‌పై మస్క్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్విటర్ పుణ్యమా అని ఇప్పుడు సెటైర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. నెటిజన్లు ఎలన్ మస్క్‌పై సెటైర్స్ వేస్తుంటే, అతడు మాత్రం ట్విటర్ మీద కౌంటర్లు వేస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా ఆనంద్ మహీంద్రా కూడా చేరిపోయారు. మస్క్‌ని ఉద్దేశిస్తూ.. పైసా ఖర్చు పెట్టకుండానే మనోడు నిత్యం వార్తల్లో భలే నానుతున్నాడే అనే అభిప్రాయాన్ని వ్యంగ్యంగా వ్యక్తపరిచారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. స్కామ్ అకౌంట్లకి సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేదన్న కారణంతో తాను ట్విటర్ డీల్ నుంచి వైదొగులుతున్నానని ఎలన్ మస్క్ ప్రకటించినప్పటి నుంచీ అతనిపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇలా అతనిపై వివిధ వార్తలొస్తున్న నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా అతడ్ని ఉద్దేశిస్తూ సెటైరికల్ ట్వీట్ వేశారు. ‘‘ఎలన్ మస్క్ ఓ భారతీయ రైలులో ప్రయాణిస్తే, కండక్టర్ అతడ్ని ‘టీటీ’ (టికెట్‌లెస్ ట్రావెలర్)గా ముద్ర వేస్తాడు. అయితే, ఆ టికెట్‌లేని ప్రయాణికుడు కూడా అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు’’ అంటూ ట్వీట్ చేశారు. మస్క్ మీదే వ్యంగ్యంగా ట్వీట్ వేయడంతో.. ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Also Read
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
మరోవైపు.. 44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని మస్క్ రద్దు చేయడంపై ట్విటర్ న్యాయపోరాటానికి దిగింది. ఒప్పందంగా ప్రకారం కచ్ఛితంగా ట్విటర్‌ను కొనుగోలు చేయడం లేదా నష్టపరిహారం చెల్లించేయా ఆదేశించాలంటూ కోర్టుని ఆశ్రయించింది. దీనిపై మస్క్ స్పందిస్తూ.. మొదట్లో వాళ్లు ట్విటర్‌ని కొనలేరన్నారు, తర్వాత బాట్ ఇన్ఫో రివీల్ చేయలేమన్నారు, ఇప్పుడేమో ట్విటర్ కొనాల్సిందేనని కోర్టులో నాపై ఒత్తిడి తెస్తున్నారు, ఇప్పుడు వాళ్లు బాట్ ఇన్ఫోని కోర్టులో బహిర్గతం చేయాల్సి ఉంటుంది’’ అంటూ ఆయా కొటేషన్ పక్కన మస్క్ పగలబడి నవ్వుతుంటే ఫోటోల్ని జోడించి సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
If Elon was traveling on an Indian train, the conductor would label him a “TT” Ticketless Traveler. But TT could now also become a term for any headline grabbing bid that implodes: A Twitter Tease. https://t.co/Pn8ikF4NxF
— anand mahindra (@anandmahindra) July 9, 2022
— Elon Musk (@elonmusk) July 11, 2022
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!