NTV Telugu Site icon

Justin Trudeau: డొనాల్డ్ ట్రంప్‌కు కెనడా ప్రధాని ట్రూడో వార్నింగ్..

Canada

Canada

Justin Trudeau: హాలీఫాక్స్‌ ఛాంబరాఫ్‌ కామర్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. తమపై ట్రంప్‌ అదనపు టారీఫ్ లు విధిస్తే.. తాము ప్రతి చర్యలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో ట్రంప్‌ గత కార్యవర్గంతో పోలిస్తే.. కొత్త బృందంతో డీల్‌ చేయడం కొంచెం కష్టమైనదన్నారు. అయితే, ప్రజల జీవితాలను సరళతరం చేస్తానన్న చెప్పి అధికారంలోకి వచ్చారు ట్రంప్.. కానీ, ఇప్పుడు వారికి అసలు విషయాలు బోధపడుతున్నాయి. కెనడా నుంచి వచ్చే ప్రతి వస్తువుపై పన్నులూ విధించడం వల్ల జీవన వ్యయాలు మరింత పెరిగిపోతాయని యూఎస్ ప్రజలకు అర్థమవుతోందని జస్టిన్ ట్రూడో చెప్పుకొచ్చారు.

Read Also: PM Modi-Adani Bag: ప్రియాంక గాంధీ బ్యాగ్‌పై మోడీ-అదానీ ఫోటోలు.. అభినందించిన రాహుల్

ఇక, ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. నేను వాణిజ్య భాగస్వాములపై విధించే పన్నులతో ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరగడం లేదనే హామీ ఇవ్వడం లేదు.. కానీ, ఏ రకంగానూ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోం కదా.. 25 శాతం సుంకాలనేవి కెనడా ఆర్థిక వ్యవస్థను బాగా నాశనం చేయనుంది. యూఎస్ మన నుంచి 65 శాతం చమురు, చెప్పుకోదగ్గ స్థాయిలో విద్యుత్తు, దాదాపు మొత్తం సహజ వాయువును దిగుమతి చేసుకుంటుందని ఆయన తెలిపారు. అలాగే, అమెరికా అల్యూమినియం, వ్యవసాయోత్పత్తులకు కూడా మనపైనే ఆధారపడిందన్నారు. మనపై టారిఫ్‌లు విధిస్తే వీటి ధరలు భారీగా పెరుగుతాయి.. గత 8 ఏళ్ల క్రితమే ఇలాంటిది ఎదుర్కొన్నాం.. ఇప్పుడూ ఎదుర్కొంటామని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.