Site icon NTV Telugu

Mary Millben: రాహుల్‌గాంధీకి ఆ చతురత లేదు.. మోడీపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అమెరికా గాయని

Mary Millben

Mary Millben

ట్రంప్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారంటూ కాంగ్రస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల్ని అమెరికా గాయని మేరీ మిల్బెన్ ఖండించారు. రాహుల్ గాంధీకి భారత ప్రధాని అయ్యే చతురత లేదని ఆమె విమర్శించారు. ట్రంప్‌కు మోడీ భయపడరని.. అమెరికాతో భారత దౌత్యం వ్యూహాత్మకమైందని రాసుకొచ్చారు. భారతదేశానికి ఏది మంచిదో అదే చేస్తారన్నారు. దేశాధినేతలంతా అలానే చేస్తారని.. ఈ విషయంలో మోడీని అభినందిస్తున్నట్లు చెప్పారు. దేశానికి ఏది మంచిదో అదే చేస్తారని మేరీ మిల్బెన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Bihar Elections: మజ్లిస్ పార్టీ అభ్యర్థి విందులో బిర్యానీ కోసం తన్నులాట.. వీడియో వైరల్

ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయమని ప్రధాని మోడీ చెప్పారని తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ట్రంప్-మోడీ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Gudivada Amarnath: గూగుల్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే లక్ష 80 వేలు ఉద్యోగులు.. ఏపీలో రెండు లక్షలు ఎలా ఇస్తారు..?

ట్రంప్ ప్రకటన తర్వాత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ట్రంప్‌ను చూసి మోడీ భయపడుతున్నారని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని అమెరికా గాయని తప్పుపట్టారు. మోడీ నాయకత్వాన్ని మేరీ మిల్బెన్ తరచుగా ప్రశంసలతో ముంచెత్తుతారు. ఒకసారి వేదికపై మోడీ కాళ్ల మీద పడి ఆమె ఆశీస్సులు కూడా తీసుకున్నారు. మోడీ పాలనను మేరీ మిల్బెన్ ఇష్టపడుతుంటారు.

 

 

Exit mobile version