NTV Telugu Site icon

Sudiksha Missing: సుదీక్ష మిస్సింగ్‌పై కీలక అప్‌డేట్

Sudikshakonanki

Sudikshakonanki

సుదీక్ష కోనంకి భారత సంతతి విద్యార్థిని. అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. బీచ్‌లో నడుస్తుండగా అకస్మాత్తుగా మార్చి 6న అదృశ్యమైంది. దీంతో ఆమె స్నేహితులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దాదాపు 10 రోజుల నుంచి ఆమె కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. హెలికాప్టర్, పడవులు, డ్రోన్లు సాయంతో గాలిస్తున్నారు. అయినా ఎలాంటి పురోగతి లభించలేదు.

ఇది కూడా చదవండి: Karnataka: రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఫైర్

అయితే వీడియోలో మరొక అమెరికన్ కళాశాల యువకుడు జాషువా రీబ్‌తో కలిసి పుంటా కానా బీచ్ వైపు వెళ్తున్న దృశ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. దీంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాషువా రీబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులు అనుమానితుడిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. బీచ్‌లో నడుస్తుండగా ఒక పెద్ద కెరటం వచ్చిందని.. ఆ సమయంలో ఇద్దరం లోపలికి వెళ్లిపోయినట్లు తెలిపాడు. అయితే తాను మాత్రం బయటకు రాగలిగానని.. ఆమె మాత్రం తిరిగి రాలేదని చెప్పాడు. అక్కడే ఉన్న మరొక టూరిస్ట్‌ను వాకబు చేయగా కొట్టుకుపోయినట్లుగా చెప్పాడన్నాడు. అయినా అతడి మాటలు కూడా సరిగ్గా వినిపించలేదని చెప్పుకొచ్చాడు. విచారణకు సహకరిస్తానని జాషువా రీబ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అధికారులు పాస్‌పోర్ట్ జప్తు చేశారు. ఇక ఆమెకు సంబంధించిన దుస్తులు బీచ్ ఒడ్డున కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Saira Banu : నన్ను రెహమాన్ మాజీ భార్య అని పిల‌వకండి..

ఇదిలా ఉంటే తమ కుమార్తె బీచ్‌లో కొట్టుకుపోలేదని సుదీక్ష తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఎవరో కిడ్నాప్ చేశారని వాదిస్తున్నారు. ఒకవేళ బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటే.. ఈపాటికే మృతదేహం బయటకు వచ్చేదని వాదిస్తున్నారు. అయితే అధికారులు.. వారి వాదనను తోసిపుచ్చతున్నారు. అలలకే కొట్టుకుపోయి ఉండొచ్చని పోలీసులు కూడా చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Warangal: కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేయని ఏసీలు.. సర్జరీలను నిలిపివేసిన వైద్యులు