Usha Vance: భారత్ టూర్ విశేషాలను నెమరువేసుకున్న ఉషా వాన్స్
- భారత్ టూర్ విశేషాలను నెమరువేసుకున్న ఉషా వాన్స్
- ఆహారం అద్భుతంగా ఉందంటూ కితాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు.. పిల్లలతో కలిసి ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించారు. దేశంలో అనేక ప్రాంతాలను వీక్షించారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాలను సందర్శించి సంతోషంగా వెళ్లారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: మూడు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?
Also Read
తాజాగా భారత్ టూర్ విశేషాలు, ప్రధాని మోడీ ఇచ్చిన ఆతిథ్యాన్ని అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ గుర్తుచేసుకున్నారు. మోడీ నివాసంలో ఉన్నప్పుడు.. తమ పిల్లలతో మోడీ చాలా కలివిడిగా మెలిగారని తెలిపారు. మోడీతో జరిగిన సమావేశం చాలా ప్రత్యేకమైందన్నారు. పిల్లల్ని మోడీ కౌగిలించుకుని దగ్గరకు తీసుకున్నారని చెప్పారు. రామాయణం నుంచి చిన్న చిన్న బొమ్మల ప్రదర్శన ద్వారా వివిరించినట్లు గుర్తుచేశారు. దీంతో మోడీని తాతగా భావించారని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త.. హరీష్ శంకర్ కీలక ప్రకటన
సోమవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్‌లో ఉషా వాన్స్ భారత్ పర్యటన అనుభవాన్ని పంచుకున్నారు. భారత్ పర్యటన జీవితకాలం గుర్తుండిపోయే యాత్ర అని అభివర్ణించారు. తమ పిల్లలు మొదటి సారి భారత్‌లో పర్యటించారని.. తాజ్‌మహల్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రదేశాలను సందర్శించినట్లు చెప్పారు. ఇక భారతీయ ఆహారాన్ని ఆస్వాదించినట్లు పేర్కొన్నారు.
ఇక ఉత్తర భారతదేశంలో కొన్ని గొప్ప ప్రదేశాలను చూసే అవకాశం లభించిందని తెలిపారు. తదుపరి పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మా కుటుంబం నివాసం ఉన్న ప్రాంతాలకు కూడా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ భోజనం అయితే అద్భుతంగా ఉందని ప్రశంసించారు. పెద్ద కుమారుడు ఇవాన్.. ఆలయ శిల్పాలకు బాగా ఆకర్షితుడైనట్లు చెప్పారు. చిన్న కుమారుడు వివేక్.. ఏనుగులు, ఒంటెలు, నెమళ్లను చూసి ఆశ్చర్యపోయాడని తెలిపారు. ఇక కుమార్తెకు ఆటో రిక్షాలో ప్రయాణించడం బాగా నచ్చిందని పేర్కొన్నారు.
ఏప్రిల్‌లో జేడీ వాన్స్ కుటుంబం భారత్‌లో నాలుగు రోజులు పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కుటుంబ సభ్యులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమయంలో పిల్లలు ప్రధానమంత్రి మోడీతో సరదాగా గడిపారు. పచ్చిక బయళ్లను అన్వేషించడం నుంచి పక్షి తినే ఆహారాన్ని ఆసక్తిగా చూడటం వరకు, పిల్లలు ప్రధానమంత్రి నివాసంలో లీనమైపోయారు. ప్రధాని మోడీ ముగ్గురు పిల్లలకు నెమలి ఈకలను బహుకరించారు. మిరాబెల్ వాన్స్ తన తండ్రితో కలిసి ఈకను పట్టుకుని హృదయపూర్వకంగా ఆస్వాదిస్తూ కనిపించింది. ఇక ఆగ్రాలోని ఐకానిక్ తాజ్ మహల్‌ను సందర్శించారు. జైపూర్‌లోని అంబర్ కోట, న్యూఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయం, సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియంను జేడీ వాన్స్ ఫ్యామిలీ సందర్శించింది.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!