NTV Telugu Site icon

US Elections: నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు..

Us

Us

US Elections: అమెరికాలో ప్రతి ప్రతి నాలుగేళ్లకు జరిగే లీఫ్ ఇయర్ నవంబర్ ఫస్ట్ మంగళవారం ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి ఎన్నికల్లో గెలిచిన వారు.. జనవరిలో పదవీ బాధ్యతలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నేడు జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉండగా.. డెమాక్రాట్స్ తరుపున కమల్ హారిస్ పోటీ చేస్తున్నారు. అగ్రరాజ్యం ఎన్నికలపైనే ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అయితే, దాదాపుగా 24.4 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే 7.5 కోట్ల మంది ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ట్రంప్, హారిస్‌ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమైయ్యారు. మెయిల్స్, పోలింగ్‌ కేంద్రాల ద్వారా యూఎస్ ప్రజలు తమ ఓట్లను వేస్తున్నారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఇక, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ నార్త్‌ కరోలినాలో మకాం వేశారు. 2016, 2020లలో తనకు సపోర్టుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా నజర్ పెట్టారు. న్యూమెక్సికో, వర్జీనియాలనూ సైతం సీరియస్‌గా తీసుకున్నారు ఆయన. అలాగే, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. తుఫాన్ కారణంగా నార్త్‌ కరోలినా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఈ ప్రాంత ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారనే దానిపై సందిగ్ధత కొనసాగుతుంది. అయితే, శుక్రవారం నాటికి నార్త్‌ కరోలినాలో 78 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read Also: Devendra Fadnavis: ముఖ్యమంత్రి పదవిపై ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు

అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు పరోక్షంగా కొనసాగుతాయి. ఇక్కడి ప్రజలు నేరుగా ప్రెసిడెంట్ ను ఎన్నుకోరు. వీరు ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులకు ఓట్లు వేస్తే.. వారందరు కలిసి అధ్యక్షుడుని ఎన్నుకుంటారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు ఉండగా.. అందులో 270 సీట్లు ఎవరికి వస్తాయో వాళ్లే అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకోవాలి. అయితే ఈ ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌తో పాటు లిబర్టేరియన్ పార్టీ నుంచి ఛేస్ ఒలివర్, గ్రీన్‌పార్టీ అభ్యర్థిగా జిల్ స్టెయిన్, స్వతంత్ర అభ్యర్థిగా రాబర్ట్ జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ యూఎస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.