US Elections: నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు..
- నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు..
- డొనాల్డ్ ట్రంప్- కమలా హరీస్ మధ్య పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Elections: అమెరికాలో ప్రతి ప్రతి నాలుగేళ్లకు జరిగే లీఫ్ ఇయర్ నవంబర్ ఫస్ట్ మంగళవారం ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి ఎన్నికల్లో గెలిచిన వారు.. జనవరిలో పదవీ బాధ్యతలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నేడు జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉండగా.. డెమాక్రాట్స్ తరుపున కమల్ హారిస్ పోటీ చేస్తున్నారు. అగ్రరాజ్యం ఎన్నికలపైనే ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అయితే, దాదాపుగా 24.4 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే 7.5 కోట్ల మంది ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ట్రంప్, హారిస్ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమైయ్యారు. మెయిల్స్, పోలింగ్ కేంద్రాల ద్వారా యూఎస్ ప్రజలు తమ ఓట్లను వేస్తున్నారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
- Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
- Elon Musk: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
ఇక, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నార్త్ కరోలినాలో మకాం వేశారు. 2016, 2020లలో తనకు సపోర్టుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా నజర్ పెట్టారు. న్యూమెక్సికో, వర్జీనియాలనూ సైతం సీరియస్‌గా తీసుకున్నారు ఆయన. అలాగే, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. తుఫాన్ కారణంగా నార్త్ కరోలినా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఈ ప్రాంత ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారనే దానిపై సందిగ్ధత కొనసాగుతుంది. అయితే, శుక్రవారం నాటికి నార్త్ కరోలినాలో 78 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read Also: Devendra Fadnavis: ముఖ్యమంత్రి పదవిపై ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు
అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు పరోక్షంగా కొనసాగుతాయి. ఇక్కడి ప్రజలు నేరుగా ప్రెసిడెంట్ ను ఎన్నుకోరు. వీరు ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులకు ఓట్లు వేస్తే.. వారందరు కలిసి అధ్యక్షుడుని ఎన్నుకుంటారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు ఉండగా.. అందులో 270 సీట్లు ఎవరికి వస్తాయో వాళ్లే అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకోవాలి. అయితే ఈ ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌తో పాటు లిబర్టేరియన్ పార్టీ నుంచి ఛేస్ ఒలివర్, గ్రీన్పార్టీ అభ్యర్థిగా జిల్ స్టెయిన్, స్వతంత్ర అభ్యర్థిగా రాబర్ట్ జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ యూఎస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.
తాజావార్తలు
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!