Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Crash: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రెస్నో నగరంలో శనివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో బ్లైత్ అవెన్యూలోని సియెరా స్కై పార్క్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం ఫ్రెస్నో నగరంలోని వాయువ్య భాగంలో ఉంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అధికారులు ఘటనపై దర్యాప్తు స్టార్ట్ చేశారు.
రంగంలోకి దిగిన అధికారులు
విమాన ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫ్రెస్నో పోలీస్ డిపార్ట్మెంట్, ఫ్రెస్నో ఫైర్ డిపార్ట్మెంట్, పీజీఈ, ఫ్రెస్నో కౌంటీ షెరీఫ్ కార్యాలయం, నార్త్ సెంట్రల్ ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతానికి భారీ సంఖ్యలో వాహనాలు, అత్యవసర సిబ్బంది చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానం కూలిన ఘటనతో పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పీజీఈ అవుటేజ్ మ్యాప్‌లో కూడా ఈ అంతరాయం నమోదైంది. అయితే కొద్దిసేపటికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
Also Read
- US - Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా - ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
- Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
- BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
ప్రస్తుతం అధికారులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారిస్తూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. విమానంలో ఉన్న పైలట్, ప్రయాణికుల గుర్తింపును అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏంటి? విమానం సాంకేతిక సమస్యకు గురైందా? లేక ఇతర కారణాలతో కూలిపోయిందా? అనే కోణాల్లో అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్రెస్నో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రాంతంలో సాధారణ పరిస్థితులను కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
-
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
-
KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!