Site icon NTV Telugu

Iran-Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రమేయం ఉంది..

Iran

Iran

Iran-Israel War: పశ్చిమాసియాలో ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్- ఇరాన్ దేశాలు సైనిక, డ్రోన్, క్షిపణి దాడులను వేగవంతం చేశాయి. అయితే, ఈ రోజు (జూన్ 21న) ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశం సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. అమెరికా యుద్ధంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభిస్తే అది “చాలా దురదృష్టకరం” అని అన్నారు. ఇక, ఇజ్రాయెల్ దాడులు ఆపి.. ఇప్పటి వరకు జరిగిన నేరాలకు జవాబుదారీగా ఉంటే, ఇరాన్ దౌత్యం గురించి ఆలోచించడానికి సిద్ధంగా ఉంది అని అరఘ్చి వెల్లడించారు.

Read Also: Faridabad: కోడలు పారిపోయిందని అత్తమామలు ఆరోపణ.. 10 అడుగుల గుంతలో మృతదేహం లభ్యం

ఇక, ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణుల ఆయుధాగారాల ముప్పును తొలగించడానికి సాధ్యమైనంత కాలం తమ సైనిక కార్యకలాపాలు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. మరోవైపు, శుక్రవారం నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారితే సైనిక చర్యను కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. ఇరు దేశాలకు రెండు వారాల పాటు సమయం ఇస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక, ఈ వివాదానికి మధ్యవర్తిత్వం వహించే యూరప్ సామర్థ్యంపై ట్రంప్ కూడా సందేహం వ్యక్తం చేశారు. ఇరాన్ యూరప్‌తో మాట్లాడటానికి ఇష్టపడదని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Exit mobile version