NTV Telugu Site icon

Israel-Gaza: హమాస్ మెరుపుదాడి.. ఇజ్రాయెల్ మెర్కావా ట్యాంక్ పేల్చివేత

Hamas

Hamas

గాజాలో హమాస్ మెరుపు దాడి చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన మెర్కావా ట్యాంక్‌ను హమాస్ పేల్చేసింది. ఐడీఎఫ్ వాహనాలే లక్ష్యంగా కొత్త హమాస్ ఐఈడీతో దాడి చేసింది. దీంతో యుద్ధం ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఐఈడీ దాడితో ఒక్కసారి పెద్దగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Israel-Gaza: నెతన్యాహు ప్రభుత్వం కీలక నిర్ణయం.. గాజా దారి వదిలిపెట్టిన ఇజ్రాయెల్

హమాస్ అంతమే లక్ష్యంగా గతకొద్ది రోజులుగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. హమాస్ అగ్ర నాయకులందరినీ ఇప్పటికే అంతమొందించింది. ఇక గాజా పట్టణాన్ని ఐడీఎఫ్ సర్వనాశనం చేసింది. ఇంకా ఇజ్రాయెల్ వేట కొనసాగిస్తూనే ఉంది. తాజాగా హమాస్ మెరుపుదాడితో ఐడీఎఫ్ షాక్ అయింది. హమాస్ నేతలు ఇంకా ఉన్నారని నిర్ధారణకు వచ్చింది. ఐడీఎఫ్ ట్యాంక్ పేల్చివేతతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తం అయింది. దాడులు మరింత తీవ్రం చేసేందుకు సిద్ధపడుతోంది.

ఇది కూడా చదవండి: Cigarette with Tea : ఛాయ్‌తో పాటు సిగరెట్ తాగుతున్నారా?

అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఆ నాటి నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే గాజా పట్టణం నాశనం అయింది. అలాగే హమాస్ నాయకులను కూడా అంతం చేసింది. ఇదిలా ఉంటే అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. తాను వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టేలోపు.. గాజాలో యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్‌కు సూచించింది. ఆ దిశగానే నెతన్యాహు ప్రభుత్వం దూసుకెళ్తోంది.

 

 

Show comments