NTV Telugu Site icon

Iran-Israel Attack: చైనా, రష్యా మద్దతుతో ఇరాన్ ఎమర్జెనీ మీటింగ్‌కు పిలుపు.. ఇజ్రాయెల్ ఎటాక్‌పై యూఎన్‌లో చర్చ

Uniran

Uniran

ఇజ్రాయెల్ ముందే హెచ్చరించినట్టుగా ఇరాన్‌పై దాడులకు తెగబడింది. శనివారం ఇరాన్ వైమానికి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో తమ లక్ష్యాలను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ వైమానికి స్థావరాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్‌షా నెక్స్ట్‌ టార్గెట్ పశ్చిమ బెంగాల్‌.. మమతను గద్దె దింపేందుకు భారీ వ్యూహం?

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. చైనా, రష్యా, అల్జీరియా మద్దతుతో ఐక్యరాజ్యసమితిలో ఎమర్జెన్సీ మీటింగ్‌కు ఇరాన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘి.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, భద్రతా మండలి అధ్యక్షుడికి శనివారం రాసిన లేఖ రాశారు. ఇజ్రాయెల్ దురాక్రమణల పర్యవసానాలను పరిగణనలోకి తీసుకుని.. నిర్ణయాత్మక వైఖరిని తీసుకోవాలని లేఖలో మంత్రి కోరారు. ఇజ్రాయెల్ చర్యలను ఖండించాలని 15 మంది సభ్యుల భద్రతా మండలిని ఆయన కోరారు. ఈ మేరకు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ విజ్ఞప్తి మేరకు యూఎన్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్‌కు రష్యా, చైనా, అల్జీరియా మద్దతు తెలిపింది.

ఇది కూడా చదవండి: Census: 2025 నుంచి జనాభా లెక్కల సేకరణ.. డీలిమిటేషన్‌పై కేంద్రం సిద్ధం..

అక్టోబర్ 26(శనివారం)న ఖుజెస్తాన్, ఇలామ్, టెహ్రాన్‌ ప్రావిన్స్‌లోని అనే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాన్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రాంతాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో నలుగురు ఇరాన్ సైనికులు, ఒక పౌరుడు మరణించాడు.

అక్టోబర్ ప్రారంభంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ 180 క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ గగనతలంలోనే పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాలను తాకాయి. పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ముందే హెచ్చరించినట్లుగా ఇజ్రాయెల్ గత శనివారం ఇరాన్‌పై దాడులకు తెగబడింది.

ఇది కూడా చదవండి: Lucky Baskhar: ప్రేక్షకులకు బోర్ కొట్టించొద్దు.. రిస్క్ అనే ఫీలింగే లేదు: మీనాక్షి చౌదరి ఇంటర్వ్యూ