Site icon NTV Telugu

మహిళలకు తాలిబన్ల షాక్.. ఇక, ఆటలొద్దు..!

ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.. ఇక, మహిళలపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు తాలిబన్లు.. తాజాగా అమ్మాయిలు, మహిళలు ఎలాంటి క్రీడలు ఆడకూదంటూ ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్.. ఆఫ్ఘన్‌ మహిళలు క్రికెట్‌ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.. వారు ఎలాంటి ఆటలు ఆడేందుకు అనుమతి లేదని పేర్కొంది. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదు.. క్రీడలతో బాడీ ఎక్స్‌పోజింగ్‌ అవుతుందని వ్యాఖ్యానించారు తాలిబన్‌ కల్చరల్‌ కమిషన్‌ డిప్యూటీ హెడ్‌ అహ్మదుల్లా వాసిఖ్‌..

గతంలో తాలిబన్ల ప్రభుత్వ హయాంలో మహిళలపై ఎన్నో అరచకాలు జరిగాయి.. కేవలం వారిని సెక్స్‌ బానిసలుగా మార్చేశారు తాలిబన్లు.. మళ్లీ ఆప్ఘన్‌ వారి వశం అయినప్పటి నుంచే అందరిలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.. కొందరు దేశాన్ని విడిచి వెళ్లిపోగా.. ఉన్నవారిపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాలిబన్‌ కల్చరల్‌ కమిషన్‌ డిప్యూటీ హెడ్‌ అహ్మదుల్లా వాసిఖ్‌.. మహిళలకు ఆటలు ముఖ్యమని అనుకోవట్లేదన్నా… క్రికెట్‌ అయినా.. ఇంకా ఏ ఆటైనా సరే అమ్మాయిలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. క్రీడల్లో మహిళలకు ఇస్లామిక్‌ డ్రెస్‌ కోడ్‌ ఉండదన్న ఆయన.. ఆటలు ఆడేవారు ముఖం, శరీరం కవర్‌ చేసుకోలేరని… ఇక మీడియా ద్వారా వారి ఫొటోలు, వీడియోలను ప్రపంచమంతా మీడియా ద్వారా చూస్తారన్నారు.. మహిళలు అలా కనిపించడానికి తమ ప్రభుత్వం ఒప్పుకోదన్న ఆయన.. అందుకే మహిళలకు క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వడంలేదని తెలిపారు.

Exit mobile version