Pakistan Train Accident: పాకిస్థాన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 30కి చేరింది. షాజాద్‌పూర్ – నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌లోని 10 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. షాజాద్‌పూర్ మరియు నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పది కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 30 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను నిలిపివేశారు. రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని నవాబ్‌షాలోని పీపుల్స్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Read also: Priya Prakash Varrier : మత్తెక్కించే ఫోజులతో రెచ్చగొడుతున్న మలయాళీ భామ..
సహారా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 10 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్ రెహమాన్ మీడియాకు తెలిపారు. అయితే ఇంకా పూర్తి సమాచారం రావాల్సిఉందన్నారు. ప్రమాదం జరిగిన బోగీల నుండి ప్రయాణికులను తరలించడానికి సహాయక బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. రైల్వే, విమానయాన శాఖ మంత్రి ఖ్వాజా సాద్ రఫీక్ మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 15 మంది చనిపోయారని, పలువురు గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. ప్రమాదం చాలా బాధాకరం. ప్రస్తుతం బాధిత ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధమ కర్తవ్యమని మంత్రి ప్రకటించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని నవాబ్‌షా డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.
